Homeఎక్స్ క్లూసివ్ఆర్ ఆర్ ఆర్ రన్ టైంను లాక్ చేసిన రాజమౌళి

ఆర్ ఆర్ ఆర్ రన్ టైంను లాక్ చేసిన రాజమౌళి

ఆర్ ఆర్ ఆర్ రన్ టైంను లాక్ చేసిన రాజమౌళి
ఆర్ ఆర్ ఆర్ రన్ టైంను లాక్ చేసిన రాజమౌళి

ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన భారీ యాక్షన్ డ్రామా ఆర్ ఆర్ ఆర్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో హీరోలుగా నటించిన విషయం తెల్సిందే. మూడేళ్ళుగా ఈ చిత్ర షూటింగ్ సాగుతూ వచ్చి రీసెంట్ గా పూర్తయింది. ప్రస్తుతం రాజమౌళి పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేస్తున్నాడు.

ఈ చిత్రాన్ని జనవరి 7, 2022న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే. అందుకే దీపావళి నుండి ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ ను ఫుల్ స్వింగ్ లో చేపడతారని తెలుస్తోంది. దీపావళికి టీజర్ వస్తుందని అంటున్నారు. ఈలోగా చిత్ర ఫైనల్ కట్ ను కూడా పూర్తి చేయాలని జక్కన్న భావిస్తున్నాడు.

- Advertisement -

ఇన్సైడ్ సోర్సస్ ప్రకారం ఆర్ ఆర్ ఆర్ రఫ్ కట్ 3 గంటలకు తేలిందట. దానిని 2 గంటల 45 నిమిషాలకు తగ్గించడానికి జక్కన్న అండ్ కో శ్రమిస్తున్నట్లు సమాచారం. చిత్రంలో ఎమోషనల్ కంటెంట్ ఎక్కువగా ఉండటం, భారీ యాక్షన్ సన్నివేశాల నేపథ్యంలో ఆ మాత్రం రన్ టైం ఉండాలని టీమ్ భావిస్తున్నారట.

అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటించగా, కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ కనిపిస్తాడు. అలియా భట్, ఒలీవియా మోరిస్ లు వీరి పెయిర్ గా నటించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించాడు. ఇప్పటికే దోస్తీ ప్రమోషనల్ సాంగ్ విడుదలైన విషయం తెల్సిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All