
ఆర్ఆర్ఆర్ తో మరోసారి తెలుగు సినిమా సత్తా చాటిచెప్పిన దర్శక ధీరుడు రాజమౌళి..తాజాగా కొత్త కారును కొనుగోలు చేసారు. వోల్వో ఎక్స్ సీ 40 ఎస్ యూవీని కొనుగోలు చేసారు. వోల్వో కార్స్ ఇండియా ప్రతినిధి రాజమౌళికి కారు తాళాలను అందించారు. ఈ విషయాన్ని వోల్వో కార్స్ ఇండియా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో వెల్లడించింది. రాజమౌళికి కారును అందిస్తున్న ఫొటోను షేర్ చేసారు. గొప్ప దర్శకుడు, రచయిత రాజమౌళి గారికి వోల్వో ఫ్యామిలీలోకి స్వాగతమంటూ రాసుకొచ్చారు. రాజమౌళి కొనుగోలు చేసిన ఫ్యూజన్ రెడ్ కలర్ లో ఉన్న ఈ కారు ఖరీదు..ప్రత్యేకతలు చూస్తే..
ఢిల్లీ ఎక్స్ షో రూం ప్రకారం రూ.44.50 లక్షలు. 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ తో కారుకు పవర్ నిచ్చారు. ఈ ఇంజన్ తో 187 బీహెచ్ పీ వద్ద 300 నానోమీటర్ల టార్క్ను జనరేట్ చేస్తుంది. 8 గేర్లుండడం విశేషం. డ్యుయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ ఉండడం మరో విశేషం. రాడార్ ఆధారిత సిటీ సేఫ్టీ, డ్రైవర్ అసిస్ట్ సిస్టమ్, స్టీరింగ్ అసిస్ట్, వాహనాల మధ్య దూరాన్ని ఇండికేట్ చేసే అలర్ట్ వంటి అదిరిపోయే ఫీచర్లున్నాయి. కాగా, ఎక్స్ సీ 40లోనే ఎలక్ట్రిక్ వెర్షన్ నూ వోల్వో తీసుకొస్తోంది.