
ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ఆర్ ఆర్ ఆర్. టాలీవుడ్ టాప్ హీరోలైన రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కలిసి నటిస్తుండడంతో ఈ చిత్రంపై టాలీవుడ్ లో ఆకాశాన్ని దాటే అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి సంబంధించి అప్డేట్ ను ఇచ్చారు నిర్మాతలు. ఈ చిత్ర టాకీ పార్ట్ పూర్తయిందని తెలిపారు.
ఇక కేవలం రెండు సాంగ్స్ ను మాత్రమే చిత్రీకరించాల్సి ఉందని తెలిపారు. దాంతో షూటింగ్ మొత్తం పూర్తవుతుందన్నమాట. అంతే కాకుండా రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ఇప్పటికే రెండు భాషల్లో డబ్బింగ్ ను పూర్తి చేసేసారట. మిగతా భాషల్లో కూడా అతి త్వరలోనే డబ్బింగ్ పూర్తి చేసేస్తారని తెలుస్తోంది.
ఆర్ ఆర్ ఆర్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇక మరో ఆసక్తి కలిగించే విషయం ఏమిటంటే ఆర్ ఆర్ ఆర్ విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదు. ముందు ప్రకటించిన తేదీ అక్టోబర్ 13కే ఆర్ ఆర్ ఆర్ విడుదల కాబోతోంది.