
ఆర్ఆర్ఆర్ మూవీ ప్రతి రోజు పలు రికార్డ్స్ నెలకొల్పుతూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. విడుదలకు ముందు నుండి రికార్డ్స్ ను తన ఖాతాలో వేసుకుంటూ వస్తున్నా ఆర్ఆర్ఆర్..తాజాగా బుక్ మై షో లో ఆల్ ఇండియా రికార్డులన్నీ బద్దలు కొట్టి అందర్నీ ఆశ్చర్య పరిచింది. రాజమౌళి డైరెక్షన్లో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా తెరకెక్కిన ఈ మూవీ పలు భాషల్లో వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున మార్చి 25 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
మొదటి రోజు నుండి రికార్డ్స్ కలెక్షన్లతో దుమ్ములేపుతూ వస్తుంది. వారం రోజుల్లో దాదాపు 900 కోట్లు రాబట్టిన ఈ మూవీ..బుక్ మై షో లో ఆల్ ఇండియా రికార్డులన్నీ బద్దలు కొట్టి సరికొత్త రికార్డు ను సెట్ చేసింది. ఇప్పటి వరకూ 571 కె కి పైగా ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీకి రేటింగ్ ఇవ్వడం విశేషం. ఏ సినిమాకైనా ఇదే హైయస్ట్ అని చెప్పాలి. 90 శాతం మంచి రేటింగ్ సాధించి ఈ సినిమా టాప్ లో దూసుకుపోతోంది. ఈ వార్త చూసి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.