
ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ ఆర్ఆర్ఆర్. గత వారం ప్రేక్షకుల్ ముందుకు వచ్చిన ఈ మూవీ వీకెండ్ లోనే కాదు సాధారణ రోజుల్లోనూ సాలిడ్ కలెక్షన్స్ రాబడుతుంది. తెలుగు రాష్ట్రాల్లో బుధవారం 9.35 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ రాబట్టి 6 రోజులకు 177.20 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తుంది.
తెలుగు రాష్ట్రాల్లో 6 వ రోజు కలెక్షన్స్ చూస్తే..
నైజాంలో రూ. 4.80 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.85 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 95 లక్షలు, ఈస్ట్‌లో రూ. 44 లక్షలు, వెస్ట్‌లో రూ. 33 లక్షలు, గుంటూరులో రూ. 41 లక్షలు, కృష్ణాలో రూ. 45 లక్షలు, నెల్లూరులో రూ. 31 లక్షలతో.. 6వ రోజు రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 9.54 కోట్లు షేర్, రూ. 14.60 కోట్లు గ్రాస్ రాబట్టింది.
మొత్తం ఆరు రోజుల్లో చూస్తే..
నైజాంలో రూ. 73.15 కోట్లు, సీడెడ్‌లో రూ. 36.03 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 20.27 కోట్లు, ఈస్ట్‌లో రూ. 10.85 కోట్లు, వెస్ట్‌లో రూ. 9.50 కోట్లు, గుంటూరులో రూ. 13.73 కోట్లు, కృష్ణాలో రూ. 10.45 కోట్లు, నెల్లూరులో రూ. 6.19 కోట్లతో కలిపి రూ. 180.17 కోట్లు షేర్, రూ. 267.70 కోట్లు గ్రాస్ రాబట్టింది. వరల్డ్ వైడ్ గా చూస్తే..రూ. 371.37 కోట్లు షేర్, రూ. 670 కోట్లు గ్రాస్ వసూళ్లు చేసింది.