ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలై ఐదు వారాలు పూర్తి చేసుకుంది. అయినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం సందడి కొనసాగుతూనే ఉంది. నందమూరి ఎన్టీఆర్, మెగా హీరో రామ్ చరణ్ కాంబినేషన్‌లో బడా మల్టీస్టారర్‌గా రూపొందిన చిత్రం RRR (రౌద్రం రణం రుధిరం). ఈ సినిమాను డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. రాజమౌళి డైరెక్ట్ చేయగా..కీరవాణి మ్యూజిక్ అందించారు.
ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించిన రామ్ చరణ్ సరసన ఆలియా భట్, కొమురం భీమ్ పాత్రలో నటించిన ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. ఇక మొదటి రోజు నుండే బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం రాబడుతూ రెండు వారాల్లోనే వెయ్యి కోట్లు రాబట్టి సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రస్తుతం 5 వారాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 267 కోట్లు షేర్, రూ. 403.62 కోట్లు గ్రాస్ సాధించింది.