Homeటాప్ స్టోరీస్వారం రోజుల్లోనే ఆర్ఆర్ఆర్ లాభాల్లోకి వచ్చేలా ఉంది

వారం రోజుల్లోనే ఆర్ఆర్ఆర్ లాభాల్లోకి వచ్చేలా ఉంది

rrr first weekend collections
rrr first weekend collections

ఆర్ఆర్ఆర్ కలెక్షన్లు చూస్తే..వారం రోజుల్లోనే లాభాల్లోకి వచ్చేలా ఉంది. రోజులు గడుస్తున్నా కలెక్షన్లు స్టడీగా ఉండడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మాములుగా వీక్ డేస్ లో కలెక్షన్లు డ్రాప్ అవుతాయి కానీ ఆర్ఆర్ఆర్ మాత్రం కలెక్షన్లు అలాగే స్టడీగా కొనసాగుతూ ఆశ్చర్యంలో పడేస్తున్నాయి.

రాజమౌళి డైరెక్షన్లో ఎన్టీఆర్ , రామ్ చరణ్ హీరోలుగా అలియా భట్ , సముద్ర ఖని , అజయ్ దేవగన్ ఇతర పాత్రల్లో నటించిన ఈ మూవీ గత శుక్రవారం వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున విడుదలై సంచలన విజయం సాధించింది. భారీ అంచనాల మధ్య ..భారీ ఎత్తున థియేటర్స్ లలో విడుదల కావడం తో కలెక్షన్లు గత చిత్రాల రికార్డ్స్ బ్రేక్ చేస్తున్నాయి.

- Advertisement -

ఇక ఐదొవ రోజు కలెక్షన్స్ చూస్తే..

నైజాంలో రూ. 6.70 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.36 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.51 కోట్లు, ఈస్ట్‌లో రూ. 74 లక్షలు, వెస్ట్‌లో రూ. 52 లక్షలు, గుంటూరులో రూ. 65 లక్షలు, కృష్ణాలో రూ. 70 లక్షలు, నెల్లూరులో రూ. 45 లక్షలతో.. 5వ రోజు రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 13.63 కోట్లు షేర్, రూ. 20.45 కోట్లు గ్రాస్‌ రాబట్టింది.

ఇక ఐదు రోజుల మొత్తం కలెక్షన్స్ చూస్తే..

నైజాంలో రూ. 68.35 కోట్లు, సీడెడ్‌లో రూ. 34.18 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 19.32 కోట్లు, ఈస్ట్‌లో రూ. 10.41 కోట్లు, వెస్ట్‌లో రూ. 9.17 కోట్లు, గుంటూరులో రూ. 13.32 కోట్లు, కృష్ణాలో రూ. 10 కోట్లు, నెల్లూరులో రూ. 5.88 కోట్లతో కలుపుకుని రూ. 170.63 కోట్లు షేర్, రూ. 253.10 కోట్లు గ్రాస్ సాధించింది. ఇక వరల్డ్ వైడ్ గా చూస్తే..రూ. 348.18 కోట్లు షేర్‌, రూ. 625 కోట్లు గ్రాస్‌ను వసూలు రాబట్టింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All