
ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబోలో రాజమౌళి తెరకెక్కించిన మల్టీస్టారర్ మూవీ RRR (రౌద్రం రణం రుధిరం) నాల్గో వారంలోను మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాను డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రానికి ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందించారు. ఇందులో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా చేశారు. ఇందులో చరణ్.. అల్లూరి, తారక్.. కొమరం భీం పాత్రల్లో కనిపించారు.
మార్చి 25 న పాన్ ఇండియా గా పలు భాషల్లో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. విడుదలైన ప్రతి సెంటర్ లో వసూళ్ల వర్షం కురిపిస్తూ పలు రికార్డ్స్ నమోదు చేసింది. ఇక ఈ మూవీ నాల్గు వారాల్లో ఎంత రాబట్టిందో చూద్దాం. ఈ చిత్రం నాలుగో వారంలో 14.50 కోట్ల కలెక్షన్లను నమోదు చేసింది. నాలుగో వారంలో కూడా ఈ రేంజ్ కలెక్షన్లు సాధించిన ఏడో చిత్రంగా రికార్డును సొంతం చేసుకొన్నది. 28 రోజుల్లో ఈ చిత్రం 1097 కోట్ల గ్రాస్, 592 కోట్ల షేర్‌ను సొంతం చేసుకొన్నది. ఇక 29వ రోజు ప్రపంచవ్యాప్తంగా మరో 50 లక్షలు రాబట్టడంతో 1100 కోట్ల మైలురాయిని అధిగమించింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రూ.350 కోట్లకుపైగా వసూలు చేసింది.