
ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలై ఐదు రోజులు కావొస్తున్నా బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం హౌస్ ఫుల్ కలెక్షన్ల తో దుమ్ములేపుతుంది. రాజమౌళి డైరెక్షన్లో ఎన్టీఆర్ , రామ్ చరణ్ హీరోలుగా అలియా భట్ , సముద్ర ఖని , అజయ్ దేవగన్ ఇతర పాత్రల్లో నటించిన ఈ మూవీ శుక్రవారం వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున విడుదలై సంచలన విజయం సాధించింది. భారీ అంచనాల మధ్య ..భారీ ఎత్తున థియేటర్స్ లలో విడుదల కావడం తో కలెక్షన్లు గత చిత్రాల రికార్డ్స్ బ్రేక్ చేస్తున్నాయి.
ఇక నాల్గు రోజు ఈ మూవీ కలెక్షన్స్ చూస్తే..
నార్త్ లో సుమారు 15 కోట్ల నికర వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తుంది. అమెరికా లో 151,356 డాలర్లకుపైగా రాబట్టింది అంటున్నారు. హైదరాబాద్ క్రాస్ రోడ్డు లో నాలుగో రోజున 44,05 లక్షలు సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో నాల్గో రోజు రూ. 16 కోట్లు రాబట్టింది. వరల్డ్ వైడ్ గా నాలుగో రోజున 35 కోట్ల షేర్, 70 కోట్లకుపైగా గ్రాస్ ను సాధించినట్లు చెపుతున్నారు.