
రాజమౌళి డైరెక్షన్లో ఎన్టీఆర్ , రామ్ చరణ్ హీరోలుగా అలియా భట్ , సముద్ర ఖని , అజయ్ దేవగన్ ఇతర పాత్రల్లో నటించిన ఈ మూవీ నిన్న శుక్రవారం వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున విడుదలై సంచలన విజయం సాధించింది. భారీ అంచనాల మధ్య ..భారీ ఎత్తున థియేటర్స్ లలో విడుదల కావడం తో కలెక్షన్లు గత చిత్రాల రికార్డ్స్ బ్రేక్ చేస్తున్నాయి.
తాజాగా మూడు రోజుల కలెక్షన్స్ చూస్తే..నైజాంలో రూ. 15.05 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.40 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.14 కోట్లు, ఈస్ట్‌లో రూ. 1.72 కోట్లు, వెస్ట్‌లో రూ. 1.10 కోట్లు, గుంటూరులో రూ. 1.95 కోట్లు, కృష్ణాలో రూ. 2.03 కోట్లు, నెల్లూరులో రూ. 96 లక్షలతో రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 33.35 కోట్లు షేర్, రూ. 50.50 కోట్లు గ్రాస్ రాబట్టింది. ఓవరాల్ గా మూడు రోజులకు కలిపి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 139.09 కోట్లు షేర్, రూ. 203 కోట్లు గ్రాస్ సాధించింది. వరల్డ్ వైడ్ గా చూస్తే..రూ. 275.54 కోట్లు షేర్, రూ. 486 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.