Homeటాప్ స్టోరీస్నార్త్ లో రెండోవారంలో మరింత పుంజుకున్న ఆర్ఆర్ఆర్..

నార్త్ లో రెండోవారంలో మరింత పుంజుకున్న ఆర్ఆర్ఆర్..

RRR north collections 2nd weekend
RRR north collections 2nd weekend

ఆర్ఆర్ఆర్ ఇక్కడ ..అక్కడ ..ఆ భాష..ఈ భాష అనే తేడాలు లేకుండా అంత కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. చరణ్ నోటా కుంభస్థలాన్ని బద్దలు కొడతాం పదా..అని అనిపించారో..ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్స్ ను బద్దలు కొడుతుంది. ఇప్పటికే సినిమా రిలీజ్ అయ్యి వారం పూర్తయినప్పటికీ..ఎక్కడ కూడా కలెక్షన్లు డ్రాప్ అవ్వకపోగా..నార్త్ లో రెట్టింపు అవ్వడం బాలీవుడ్ సినీ విశ్లేషకులను షాక్ కు గురి చేస్తుంది. గత రెండు వారాల్లో రిలీజ్ అయినా ఏ హిందీ చిత్రం కూడా ఆర్ఆర్ఆర్ ముందు నిలవలేకపోయింది. ఏప్రిల్ 2న శనివారం నాడు రూ. 20 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టిందంటే ఆర్ఆర్ఆర్ ఏ రేంజ్ లో రన్ అవుతుందో అర్ధం చేసుకోవచ్చు.

ఇదే విషయాన్ని ఫిల్మ్ ట్రేడ్ అనలిస్ట్ సుమిత్ కాడెల్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. #RRR (హిందీ) ర్యాంపేజ్ మోడ్ లో ఉంది. నిన్నటితో పోలిస్తే రెండవ శనివారం సుమారు 50 వాతం వృద్ధిని నమోదు చేసింది.. తొలి అంచనాల ప్రకారం డే-9 వసూళ్లు రూ. 20 కోట్ల నికర స్థాయిలో ఉన్నాయి.. అత్యద్భుతంగా ఉంది !! #RRRMovie.. అని ట్వీట్లో వెల్లడించారు.

- Advertisement -

మరో ఫిల్మ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ఇప్పటికే RRR హిందీ వెర్షన్ ఏప్రిల్ 1 శుక్రవారం వరకు రూ. 146.09 కోట్లు వసూలు చేసిందని వివరాల్ని అందించారు. అతను ట్వీట్ చేస్తూ..రెండు కొత్త చిత్రాలు ఆక్రమించినప్పటికీ సినీ ప్రేక్షకుల మొదటి ఎంపిక #RRR. మార్కెట్ ప్లేస్ లో [#Attack #Morbius… ఉన్నా ఈరోజు ₹ 150 కోట్లను దాటుతుంది… [రెండవ] శని .. ఆదివారాల్లో పెద్ద వృద్ధిని అంచనా వేస్తున్నాం… [వారం 2] శుక్ర 13.50 కోట్లు. మొత్తం: ₹ 146.09 కోట్లు. #India బిజ్ … అంటూ వెల్లడించారు. నార్త్ కలెక్షన్లు చూసి చిత్ర యూనిట్ మరింత సంతోషం వ్యక్తం చేస్తుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All