Homeటాప్ స్టోరీస్ఆర్ఆర్ఆర్ 27 డేస్ కలెక్షన్స్

ఆర్ఆర్ఆర్ 27 డేస్ కలెక్షన్స్

RRR 27 days collections
RRR 27 days collections

ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబోలో రాజమౌళి తెరకెక్కించిన మల్టీస్టారర్ మూవీ RRR (రౌద్రం రణం రుధిరం). ఈ సినిమాను డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రానికి ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందించారు. ఇందులో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా చేశారు. ఇందులో చరణ్.. అల్లూరి, తారక్.. కొమరం భీం పాత్రల్లో కనిపించారు. మార్చి 25 న పాన్ ఇండియా గా పలు భాషల్లో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. విడుదలైన ప్రతి సెంటర్ లో వసూళ్ల వర్షం కురిపిస్తూ పలు రికార్డ్స్ నమోదు చేసింది. ఇక ఈ మూవీ 27 రోజుల కలెక్షన్ల ఫై ఓ లుక్ వేద్దాం.

27వ రోజు కలెక్షన్లు చూస్తే..నైజాంలో రూ. 8 లక్షలు, సీడెడ్‌లో రూ. 3 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 3 లక్షలు, ఈస్ట్‌లో రూ. 2 లక్షలు, వెస్ట్‌లో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 1 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో.. 26 రోజైన మంగళవారం రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 23 లక్షలు షేర్, రూ. 90 లక్షలు గ్రాస్‌‌ను రాబట్టింది. మొత్తం 27 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 264.73 కోట్లు షేర్, రూ. 399.65 కోట్లు గ్రాస్ రాబట్టగా..వరల్డ్ వైడ్ గా రూ. 591.41 కోట్లు షేర్‌, రూ. 1094.70 కోట్లు గ్రాస్‌ సాధించింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All