
యావత్ సినిమా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ‘ఆర్ఆర్ఆర్’ (రణం రౌద్రం రుధిరం) చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధానపాత్రల్లో నటించారు. ఈ చిత్రం శుక్రవారం (మార్చి 25) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ క్రమంలో గురువారం రాత్రి నుంచే ఓవర్సీస్ లో షోలు ప్రదర్శించారు. మరోవైపు ఇరు తెలుగు రాష్ట్రాలలోని థియేటర్ల వద్ద అభిమానులు సందడి చేయగా.. సినిమాను చూసిన ఫ్యాన్స్ ను విశేష స్పందన లభిస్తోంది. ఇక భారీ అంచనాల నడుమ సినిమా రిలీజ్ అవడం , అది కూడా అత్యధిక థియేటర్స్ లలో రిలీజ్ అవ్వడం తో ఫస్ట్ డే కల్లెక్షన్లపై అంచనాలు వేస్తున్నారు సినీ విశ్లేషకులు.
ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాలా అంచనా ప్రకారం.. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 200 నుంచి రూ. 250 కోట్లు వసూలు చేస్తుందట. ఓపెనింగ్ డే బాక్సాఫీస్ కలెక్షన్లు ఎక్కువగా తెలంగాణ, ఏపీ నుంచి వస్తాయని అంచనా వేశారు. తెలుగు రాష్ట్రాల్లో టిక్కెట్ ధరలు పెరగడం, దాదాపు 95 శాతం థియేటర్లలో సినిమా ప్రదర్శించడం, స్టార్ తారాగణం నేపథ్యంలో 100 నుంచి 110 కోట్లు కలెక్షన్స్ వస్తాయని రమేష్ బాలా అంచనా వేశారు. ఇక ఓవర్సీస్‌లో యుఎస్ అగ్రస్థానంలో ఉంటుందన్నారు. ఇతర దేశాల కలెక్షన్లను కూడా కలుపుకుంటే.. ఓవర్సీస్‌లో 10 మిలియన్ల కలెక్షన్లను నమోదు చేయడం ఖాయం అని అంచనా వేశారు.