
ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలై 12 రోజులు కావొస్తున్న ఇంకా బాక్స్ ఆఫీస్ వద్ద హావ తగ్గలేదు. విడుదలైన ప్రతి చోట హౌస్ ఫుల్ కలెక్షన్లతో రాణిస్తుంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలను పోషిస్తూ.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం). భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ మల్టీస్టారర్ మూవీకి ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందించగా, ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు.
మార్చి 25 న విడుదలైన ఈ మూవీ 11 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..నైజాంలో రూ. 99.24 కోట్లు, సీడెడ్‌లో రూ. 45.75 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 30.83 కోట్లు, ఈస్ట్‌లో రూ. 14.04 కోట్లు, వెస్ట్‌లో రూ. 11.79 కోట్లు, గుంటూరులో రూ. 16.52 కోట్లు, కృష్ణాలో రూ. 13.18 కోట్లు, నెల్లూరులో రూ. 8.13 కోట్లతో కలిపి రూ. 239.48 కోట్లు షేర్, రూ. 358.15 కోట్లు గ్రాస్ సాధించింది. వరల్డ్ వైడ్ గా చూస్తే..రూ. 509.48 కోట్లు షేర్, రూ. 920 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.