HomeVideosరొమాంటిక్ ట్రైలర్: హార్డ్ హిట్టింగ్ కాన్సెప్ట్

రొమాంటిక్ ట్రైలర్: హార్డ్ హిట్టింగ్ కాన్సెప్ట్

రొమాంటిక్ ట్రైలర్: హార్డ్ హిట్టింగ్ కాన్సెప్ట్
రొమాంటిక్ ట్రైలర్: హార్డ్ హిట్టింగ్ కాన్సెప్ట్

డేరింగ్ అండ్ డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొడుకు ఆకాష్ పూరిని హీరోగా పెట్టి నిర్మిస్తోన్న చిత్రం రొమాంటిక్. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా అందిస్తున్నాడు పూరి. ఆకాష్ పూరిను మెహబూబాతో డైరెక్ట్ చేసినా కానీ ఆ చిత్రం చేదు ఫలితాన్ని మిగిల్చింది. రొమాంటిక్ చిత్రం ముందు నవంబర్ 4న విడుదల కావాల్సింది కానీ ఇప్పుడు ఒక వారం ప్రీపోన్ అయింది. అక్టోబర్ 29న ఈ చిత్రం విడుదలవుతోంది.

కొద్దిసేపటి క్రితం రొమాంటిక్ చిత్ర ట్రైలర్ ను విడుదల చేసారు. ప్యాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ఈ ట్రైలర్ ను విడుదల చేసాడు. ఈ చిత్రానికి దర్శకుడు అనిల్ పాడూరి అయినా కూడా ట్రైలర్ అంతటా కూడా పూరి జగన్నాథ్ మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. రొమాంటిక్ పేరుకి తగ్గట్లుగా పూర్తిగా రొమాన్స్ లో నడిచే చిత్రం. ఇందులో ఆకాష్ పూరి, కేతిక శర్మ హీరో హీరోయిన్లుగా నటించగా రమ్య కృష్ణ కీలక పాత్ర పోషించింది. ఈ మూడు పాత్రల చుట్టూ నడిచే చిత్రంగా చెప్పుకోవచ్చు.

- Advertisement -

లోతుగా ప్రేమలో మునిగిపోయిన ఇద్దరు యువతీయువకులకు ఎదురైన సమస్యలు ఎలాంటివి, వాళ్ళ రిలేషన్ ను వాళ్ళు ఎంత సీరియస్ గా తీసుకున్నారు అన్నదానికి ఒక సీరియస్ ఇష్యూను ముడిపెడుతూ కథను అల్లారు. ట్రైలర్ లో ఆకాష్ పూరి వాయిస్, కేతిక శర్మ అందాలు మెయిన్ గా హైలైట్ అవుతున్నాయి. చూస్తుంటే రొమాంటిక్ హార్డ్ హిట్టింగ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ అని అర్ధమవుతోంది. మరి చూడాలి ఈ చిత్రం ఎంతవరకూ సక్సెస్ అవుతుందో.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All