
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం రొమాంటిక్. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. కొన్ని కీలక సన్నివేశాలను సినిమాలో ప్రముఖ నటీనటులపై చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ తో రొమాంటిక్ మేజర్ పార్ట్ టాకీ షూటింగ్ పూర్తవుతుందని తెలుస్తోంది.
ఆకాష్ పూరి సరసన హీరోయిన్ గా కేతిక శర్మ నటిస్తోంది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ బాగా వైరల్ అయిన విషయం తెల్సిందే. టాప్ లెస్ ఫోజులో హీరోయిన్, హీరోను కౌగిలించుకున్న ఫోటో జనాల్లోకి బాగా వెళ్ళింది. రొమాంటిక్ చిత్రం పూరి చిత్రాల స్టైల్ లోనే మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే ఒక ప్రేమ కథ.
అనిల్ పాదూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మందిర బేడీ కీలక పాత్రలో కనిపించనుంది. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాల పై పూరి జగన్నాథ్, ఛార్మి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.