Homeన్యూస్సరికొత్తగా రొమాంటిక్ న్యూ ట్రైలర్ - హిట్ సాధిస్తాడా?

సరికొత్తగా రొమాంటిక్ న్యూ ట్రైలర్ – హిట్ సాధిస్తాడా?

సరికొత్తగా రొమాంటిక్ న్యూ ట్రైలర్ - హిట్ సాధిస్తాడా?
సరికొత్తగా రొమాంటిక్ న్యూ ట్రైలర్ – హిట్ సాధిస్తాడా?

మెహబూబా చిత్రంతో హీరోగా పరిచయమైన పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి ప్లాప్ ను మూటగట్టుకోవాల్సి వచ్చింది. కొంత బ్రేక్ తర్వాత ఆకాష్ పూరి మరోసారి హిట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. ఆకాష్ నుండి వస్తోన్న చిత్రం రొమాంటిక్. ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. కేతిక శర్మ ఈ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమవుతోంది.

పూరి శిష్యుడు  అనిల్ పాడూరి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా మారుతున్నాడు. అయితే కథ, డైలాగ్స్ పూరి అందించాడు. రొమాంటిక్ ట్రైలర్ ఇప్పటికే విడుదలవ్వగా ఈరోజు మరో వెర్షన్ కట్ ను విడుదల చేసారు. మొదటి ట్రైలర్ లో ఆకాష్ పూరి – కేతిక శర్మల మధ్య లవ్ యాంగిల్ ను హైలైట్ చేసారు. పీకల్లోతు ప్రేమలో మునిగిపోయినా దాని గురించి తెలుసుకోలేని జంటగా వీరిద్దరూ కనిపిస్తారని అర్ధమవుతోంది.

- Advertisement -

అయితే ఈ ట్రైలర్ లో యాక్షన్ పార్ట్ పై దృష్టి పెట్టారు. గోవా సెటప్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో క్రైమ్ యాంగిల్ ను చూపించారు. పూరి సినిమాల్లో కనిపించే మకరంద్ దేశ్ పాండే విలన్ గా నటించాడు. పూరి స్టైల్ లోనే ఈ ట్రైలర్ ఉంది. సినిమా కథ ఏంటనేది అర్ధం కాకపోయినా పూరి ఏదో మ్యాజిక్ చేసి ఉంటాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. రమ్య కృష్ణ పోలీస్ ఆఫీసర్ గా కీలక పాత్రను పోషిస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All