Friday, September 30, 2022
Homeటాప్ స్టోరీస్రాఖీభాయ్ రెట్రో లుక్ అదిరిపోయిందిగా!

రాఖీభాయ్ రెట్రో లుక్ అదిరిపోయిందిగా!

Rocky bhai retro look terrific
Rocky bhai retro look terrific

సైలెంట్‌గా వ‌చ్చి ఇండియ‌న్ బాక్సాఫీస్ వ‌ద్ద దండ‌యాత్ర చేసి మోన్‌స్ట‌ర్ గా నిలిచిన‌  చిత్రం `కేజీఎఫ్‌`. పాన్ ఇండియా స్థాయిలో సంచ‌ల‌నం సృష్టించి భారీ వ‌సూళ్లు సాధించిన ఈ చిత్రం క‌న్న‌డ రాక్‌స్టార్ య‌ష్‌ని రాత్రికి రాత్రి స్టార్‌ని చేసింది. ప్ర‌స్తుతం దీనికి కొన‌సాగింపుగా `కేజీఎఫ్ చాప్ట‌ర్ 2` పేరుతో రెండ‌వ భాగం రూపొందుతోంది. దీనికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ని ఇటీవ‌లే  చిత్ర బృందం విడుద‌ల చేసింది. `రీబిల్డింగ్ ఎన్ ఎంపైర్` పేరుతో రిలీజ్ చేసిన ఫ‌స్ట్ లుక్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది. తాజాగా హీరో య‌ష్ పుట్టిన రోజుని పుర‌స్క‌రించుకుని బుధ‌వారం చిత్ర బృందం రిలీజ్ చేసిన రాఖీభాయ్ లుక్ అద‌ర‌గొడుతోంది.

- Advertisement -

రెట్రో లుక్‌లో  య‌ష్ కుడిచేతిలో  హ్యామ‌ర్‌ని ప‌ట్టుకుని స్టైలిష్‌లుక్‌లో క‌నిపిపిస్తున్న తీసు ఆక‌ట్టుకుంటోంది. ఇదే రోజు టీజ‌ర్‌ని కూడా రిలీజ్ చేయాల‌ని చిత్ర బృందం ప్లాన్ చేసింది కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల రిలీజ్ చేయ‌లేక‌పోతున్నామ‌ని చిత్ర ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ వెల్ల‌డించారు. `హాయ్…6వ వ‌ర‌కు షూటింగ్ జ‌ర‌గ‌డంతో 7న ఇక్క‌డికి చేరుకున్నాం. దీంతో 8న య‌ష్ పుట్టిన రోజు సంద‌ర్భంగా `కేజీఎఫ్ చాప్ట‌ర్ 2` టీజ‌ర్‌ని రిలీజ్ చేయ‌లేక‌పోయాం. `కేజీఎఫ్ చాప్ట‌ర్ 2`పై మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలు చాలా గొప్ప‌వి. సినిమాను  చాలా ఉత్త‌మంగా మీ ముందుకు తీసుకురావాల‌ని అనుకుంటున్నాం. మీకు ది బెస్ట్ ఇవ్వ‌డానికి ఆల‌స్య‌మ‌వుతున్నందుకు క్ష‌మించండి` అని ద‌ర్శ‌కుడు పేర్కొన్నారు.

తొలి భాగానికి మించి ఎన్నో ప్ర‌త్యేక‌త‌ల‌తో రూపొందుతున్నఈ చిత్రం ద్వారా సంజ‌య్ ద‌త్‌, ర‌వీనా టాండ‌న్ క‌న్న‌డ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యం కాబోతున్నారు. సంజ‌య్‌ద‌త్ అధీరాగా, ర‌వీనా టాండ‌న్ ప్ర‌ధాని ర‌మికా సేన్ గా క‌నిపించ‌బోతున్నారు. ఇప్ప‌టికే దేశ వ్యాప్తంగా భారీ అంచ‌నాలు నెల‌కొన్ని ఈ చిత్రాన్ని ఈ ఏడాది జూలైలో రిలీజ్ చేయ‌బోతున్నారు. క‌న్న‌డ‌, తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts