
బాలీవుడ్ క్రేజీ జంట అలియా భట్ – రణబీర్ కపూర్ లు ఏప్రిల్ 14 న వివాహ బంధంతో ఒకటికాబోతున్నారు. ఈ పెళ్లి వేడుకకు ఆర్‌కే స్టూడియోస్ సిద్దమవుతుంది. ఇక ఈ పెళ్లి వేడుకకు 45 నుంచి 50 మంది అతిథులను ప్రత్యేకంగా ఆహ్వానించినట్టు తెలుస్తుంది. అయితే ఆలియా సోదరుడు రాహుల్ భట్ మాత్రం కేవలం 28 మందిని మాత్రమే ఆహ్వానిస్తున్నట్పు చెప్పడం గమనార్హం.
ఇరు కుటుంబాలకు సంబంధించిన వారితో పాటు కరణ్ జోహర్, ఆయన్ ముఖర్జీ తదితరులు అతిథుల జాబితాలో ఉన్నట్లు సమాచారం. ఆలియాభట్ కోసం సవ్యసాచి డిజైన్ చేస్తున్నారు. అలాగే మనీష్ మల్హోత్రా కూడా కొన్ని దుస్తులు సిద్దం చేసినట్టు సమాచారం. పెళ్ళికి తక్కువ మందికే ఆహ్వానం అందించినప్పటికీ, పెళ్లి తర్వాత రిసెప్షన్ కు మాత్రం గ్రాండ్ గా అందర్నీ పిలుస్తున్నారట. ఇందుకోసం ముంబై లోని తాజ్ మహల్ ప్యాలెస్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.