Homeటాప్ స్టోరీస్క్యాన్సర్ నుండి కోలుకుంటున్న రిషి కపూర్!!

క్యాన్సర్ నుండి కోలుకుంటున్న రిషి కపూర్!!

rishi kapoor
rishi kapoor

సీనియర్ బాలీవుడ్ నటుడు రిషి కపూర్ గత కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన న్యూయార్క్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ మధ్యనే రిషి కపూర్ తన ఆరోగ్యం గురించి ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ తెలిపారు..

రిషి కపూర్ మాట్లాడుతూ.. ‘గతేడాది డిల్లీలో ఓ సినిమా చిత్రీకరణలో ఉన్నప్పుడు నేను వైద్య పరీక్షలు చేయించుకున్న ఆస్పత్రి నుంచి ఫోన్‌ వచ్చింది. అప్పుడే నాకు క్యాన్సర్‌ ఉందని తెలిసింది. ఆ తర్వాత తొమ్మిది నెలలుగా న్యూయార్క్‌లో చికిత్స తీసుకుంటున్నాను. జీవితంలో పెను మార్పు చోటుచేసుకున్నట్లు అనిపించింది. చికిత్స మొదలుపెట్టాక 26 కిలోలు తగ్గిపోయాను. నాలుగు నెలల పాటు తిండిలేదు. ఆకలి వేసేది కాదు. ఈ మధ్యనే ఎనిమిది కిలోలు పెరిగాను. ఇప్పుడిప్పుడే నా ఆరోగ్యం మెరుగవుతోంది. ఇంకా చికిత్స జరుగుతోంది. నా ఇంటిని చాలా మిస్సవుతున్నాను. నేను న్యూయార్క్‌లో మరో రెండు నెలలు చికిత్స తీసుకోవాలి. సెప్టెంబర్‌లో నా పుట్టినరోజు. కనీసం అప్పటికైనా నేను నా ఇంటికి చేరుకుంటానని ఆశిస్తున్నాను’ అని ఆయన తెలిపారు.

- Advertisement -

రిషి కపూర్ నటించిన ‘జూటా కహీ కా’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. న్యూయార్క్ నుండి వచ్చాక రిషి మళ్లీ సినిమాల్లో నటించాలని కోరుకుందాం..!!

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All