
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి కేసులో హీరోయిన్ రియా చక్రవర్తి కీలకంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా ముంబై మెయిన్ డ్రగ్ డీలర్‌లో రియా వాట్సాప్ చాట్ కూడా బయటికి రావడంతో ఆమె చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. సీబీఐ ఓ పక్క ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తుండగా ఈడీ కూడా రంగంలోకి దిగడం.. మరో పక్క నార్కోటిక్స్ డ్రగ్ కంట్రోల్ బోర్డ్ కూడా దృష్టిపెట్టడంతో సుశాంత్ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
తాజాగా విచారణ కోసం రియాకు సీబీఐ సమన్లు జారీ చేయడంతో సుశాంత్ కేసు మరింత స్పీడందుకుంది. ఈ నేపథ్యంలో గురువారం రియా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన వీడియో, ఆ వీడియోతో పాటు పలు చేర్ చేసిన విషయాలు సంచలనంగా మారాయి. సదరు వీడియోలో ఇంటిలోపలికి వస్తున్న రియా తండ్రిని మీడయా చుట్టుముట్టడం, వారిని తప్పించుకుని రియా తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తి లోపలికి రావడం కనిపిస్తోంది. ఈ వీడియోని షేర్ చేసిన రియా తమ కుటుంబానికి హాని వుందని, తమకు రక్షణ కల్పించాలని, అలా రక్షణ కల్పిస్తే విచారణకు సహకరిస్తానని వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ విషయంలో రక్షణ కల్పించమని ముంబై పోలీసులకు, సీబీఐకి విన్నవించినా ఎలాంటి రిప్లై లేదని. నాతో పాటు నా కుటుంబ సభ్యుల జీవితాలు ప్రమాదంలో వున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. తాము విచారణకు సహకరించడానికి సిద్ధంగా వున్నా మా కుటుంబానికి రక్షణ కల్పించడానికి ఎవరూ సిద్ధంగా లేరని వెల్లడించింది.