Homeటాప్ స్టోరీస్డ్ర‌గ్స్ కేస్‌:  రియా సోద‌రుడికి బెయిల్‌!

డ్ర‌గ్స్ కేస్‌:  రియా సోద‌రుడికి బెయిల్‌!

డ్ర‌గ్స్ కేస్‌:  రియా సోద‌రుడికి బెయిల్‌!
డ్ర‌గ్స్ కేస్‌:  రియా సోద‌రుడికి బెయిల్‌!

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్ప‌ద మృతి దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. ఆ త‌రువాత బ‌య‌ట‌ప‌డిన డ్ర‌గ్స్ కేసులో సుశాంత్ ప్రేయ‌సి రియా అరెస్ట్ అయిన విష‌యం తెలిసిందే. ఆ త‌రువాత ఈ కేసుకు సంబంధం వున్న చాలా మందినికి నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో సమ‌న్లు జారీ చేసి విచారించిన విష‌యం తెలిసిందే.

అయితే ఈ విచార‌ణ‌లో భాగంగా రియా సోద‌రుడు షోయిక్ చక్రవర్తి డ్రగ్ పెడ్లర్లతో సంబంధాలున్నాయ‌నే ఆరోపణలతో అరెస్టయ్యాడు. ఇదే ఆరోప‌ణలు ఎదుర్కొన్న రియా జుడీషియ‌ల్ క‌స్ట‌డీలో నెల రోజుల‌కు పైగా ఉండి ఆ త‌రువాత బెయిల్‌పై విడుద‌లైంది. రియా సోద‌రుడు షోయిక్ కూడా బెయిల్ కోసం ప్ర‌య‌త్నించి విఫ‌ల‌మ‌య్యాడు. గ‌త మూడు నెలలుగా త‌ను జైలులో ఉన్నాడు. తాజాగా అత‌నికి కూడా బెయిల్ ల‌భించ‌డంతో బ‌య‌టికి వ‌చ్చాడు.

- Advertisement -

మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించి నిందితుడిగా మొత్తం కేసులో అతని పాత్రను పరిగణనలోకి తీసుకున్న కోర్టు నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ పదార్థాల చట్టంలోని సెక్షన్ 27 ఎ తన కేసులో వర్తించదని కోర్టు తెలిపింది. అయితే ఈ కేసు రుజువైతే మాత్రం అత‌నికి 20 సంవత్సరాల వరకు శిక్షించవచ్చు అని తెలుస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All