Homeటాప్ స్టోరీస్K.C.R గా నవాజుద్దిన్ సిద్ధిఖీ..?

K.C.R గా నవాజుద్దిన్ సిద్ధిఖీ..?

K.C.R గా నవాజుద్దిన్ సిద్ధిఖీ..?
K.C.R గా నవాజుద్దిన్ సిద్ధిఖీ..?

మా బాష మీద నవ్వినావ్, మా మొఖం మీద ఊసినావ్, మా బాడీల మీద నడిచినావ్ ఆంధ్రోడా… వస్తున్నా .. నీ తాట తీయ్యడానికి వస్తున్నా అని, తన తర్వాత సినిమాను ప్రస్తుత తెలంగాణా ముఖ్యమంత్రి K.C.R బయోపిక్ ప్రకటించిన సందర్భంగా రామ్ గోపాల్ వర్మ వీడియో రిలీజ్ చేసారు. ఒక సినిమా షూటింగ్ దశలో ఉండగా, మరొక రెండు, మూడు సినిమాలు అనౌన్స్ చేసి, లెక్కకు మిక్కిలిగా టీం లను వాడుతూ ఉండే R.G.V తన తాజా చిత్రం “అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు” సినిమా రిలీజ్ చేసి, ప్రస్తుతం Enter The Girl dragon అని భారతదేశ తొలి మార్షల్ ఆర్ట్స్ చిత్రం పనుల్లో మునిగిపోయాడు.

అదేవిధంగా కడప వెబ్ సిరీస్ రిలీజ్ కి సిద్దంగా ఉండగా, K.C.R బయోపిక్ ప్రీ ప్రొడక్షన్ పనులను తన క్రియేటివ్ టీం కు అప్పగించాడు. ప్రస్తుత సమాచారం ప్రకారం TRS పార్టీ కి చెందిన కొంతమంది కీలక వ్యక్తులతో సదరు సినిమాకు సంబంధించిన కథ, అందులో ఉండవలసిన సన్నివేశాలు, క్యారెక్టర్ లు, నటీనటుల ఎంపిక ఈ మొత్తం ప్రక్రియకు సంబంధించిన పనులు సైలెంట్ గా జరుగుతున్నట్లు సమాచారం. ఇక K.C.R పాత్ర కోసం, శివసేన అధ్యక్షుడు బాల్ థాకరే బయోపిక్ లో నటించిన, నవాజుద్దిన్ సిద్దిఖీ ని అనుకుంటున్నట్లు , ఇప్పటికే ఒకసారి మేకప్ టెస్ట్ జరిపినట్లు తెలుస్తోంది. “థాకరే” సినిమాలో బాల్ థాకరే పాత్రలో అద్భుతంగా నటించిన నవాజుద్దిన్ సిద్ధిఖీ అన్నిరకాలుగా K.C.R పాత్రకు న్యాయం చేస్తాడని R.G.V భావిస్తే ఇక ఆయన ఖాతాలో మరొక మంచి సినిమా పడినట్లే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All