Homeటాప్ స్టోరీస్చంద్రబాబు కన్నీళ్లు.. ప్రమోషన్స్ కు వాడేసిన ఆర్జీవి..!

చంద్రబాబు కన్నీళ్లు.. ప్రమోషన్స్ కు వాడేసిన ఆర్జీవి..!

RGV Using Chandrababu for Movie Promotions

సంచలన దర్శకుడు ఆర్జీవి ఈమధ్య కొద్దికాలం పాటు సైలెంట్ గా ఉండి మళ్లీ మరో కాంట్రవర్షియల్ సినిమాతో సందడి మొదలు పెట్టాడు. పవర్ స్టార్ ఆర్జీవి మిస్సింగ్ ట్రైలర్ తో మరోసారి ప్రేక్షకుల ముంద్దుకు వచ్చాడు ఆర్జీవి. ఈ ట్రైలర్ కు చంద్రబాబుని వాడేసుకున్నాడు ఆర్జీవి. శుక్రవారం ఏపీ అసెంబ్లీలో జరిగిన అవమానంపై చంద్రబాబు మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని తనకు అనుగుణంగా మార్చేసుకున్నాడు ఆర్జీవి.

- Advertisement -

పవర్ స్టార్ ఆర్జీవి మిస్సింగ్ ట్రైలర్ చూసిన తర్వాతే చంద్రబాబు ఎక్కి ఎక్కి ఏడ్చాడన్నట్టు ట్విట్టర్ లో కామెంట్ పెట్టాడు వర్మ. ఇక ట్రైలర్ లో కూడా పవన్, చంద్రబాబు, చిరంజీవి, లోకేష్ లను ప్రస్థావించాడు. ఇదివరకు కూడా ఆర్జీవి ఇలాంటి ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. పవర్ స్టార్ ఆర్జీవి మిస్సింగ్ కు చంద్రబాబుని ప్రమోషన్స్ కు వాడేసుకున్నాడు ఆర్జీవి. అయితే దీనిపై టీడీపీ కార్యకర్తలు మాత్రం సీరియస్ అవుతున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All