
రామ్ గోపాల్ వర్మ గురించి చెప్పాల్సిన పనిలేదు. తన నుండి సినిమా వస్తుందంటే దానిపై ఎంత హైప్ తీసుకురావాలో అంత తీసుకొస్తాడు. సినిమా రిజల్ట్ సంగతి పక్కన పెడితే..రిలీజ్ సమయానికి అంత మాట్లాడుకునేలా చేస్తారు. దీనికోసం కోట్లు ఖర్చు పెట్టి ప్రమోషన్ చేయడు..జస్ట్ ట్విట్టర్ ఓపెన్ చేసి ట్వీట్స్ చేస్తాడు. ప్రస్తుతం అదే పనిలో ఉన్నాడు. తాజాగా ఈయన నుండి “మా ఇష్టం” (డేంజరస్) అనే సినిమా రాబోతుంది. అప్సర రాణి, నైనా గంగూలీ లు ప్రధాన పాత్ర పోషించారు. లెస్బియనిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ భాషల్లో ఏప్రిల్ 8న వర్మ విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ‘ఎ’ సర్టిఫికెట్ పొందింది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లను మొదలుపెట్టాడు వర్మ.
ఇక సినిమాకు హైప్ రావడం కోసం ఆర్ఆర్ఆర్ ను వాడుకుంటున్నాడు. ఈ మధ్యనే ఆర్ఆర్ఆర్ సినిమా ఫై , రాజమౌళి ఫై ప్రశంసలు కురిపించిన వర్మ..తాజాగా రాజమౌళి ఫై కామెంట్స్ చేసాడు. “వెల్ సర్… మీకు రామ్ చరణ్, తారక్ వంటి డేంజరస్ బాయ్స్ ఉంటే… నాకు అప్సర రాణి, నైనా గంగూలీ వంటి డేంజరస్ అమ్మాయిలు ఉన్నారు” అంటూ “ఆర్ఆర్ఆర్” త్రయం ఉన్న పిక్ కు తాను ఇద్దరు హీరోయిన్లతో ఉన్న ఫోటోను షేర్ చేశారు వర్మ. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.
Well sirrr @ssrajamouli sir, if u have ur DANGEROUS men like @AlwaysRamCharan and @tarak9999 ,I also have my DANGEROUS women like @NainaGtweets and @_apsara_rani pic.twitter.com/XWDkb9ufSH
— Ram Gopal Varma (@RGVzoomin) March 30, 2022