
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆకస్మిక అనుమానాస్పద మృతి తరువాత బాలీవుడ్‌పై దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఈ యుద్ధం జరుగుతూనే వుంది. ట్రైలర్ల అన్ లైక్ నుంచి ట్రోలింగ్ చేయడం, నెపోటిజమ్ పై దుమ్మెత్తిపోయడం తెలిసిందే. ఈ విషయంలో జాతీయ మీడియా బాలీవుడ్ అంతటినీ విలన్‌గా చిత్రీకరిస్తోందని ఆగ్రహించిన బాలీవుడ్ సూపర్‌స్టార్స్ మీడియా కథనాలపై మండిపడుతూ కోర్టు కెక్కారు.
`బాలీవుడ్ ప్రత్యేకమైనది. ఇతర పరిశ్రమల తో పోలిస్తే భిన్నమైన స్థానంతో వుంది. ఎందుకంటే ఇది దాదాపుగా సద్భావన, ప్రశంసలు మరియు ప్రేక్షకుల అంగీకారం మీద మాత్రమే ఆధారపడి ఉంటోంది. తాజాగా బాలీవుడ్‌పై జరుగుతున్న విష ప్రచారం వల్ల బాలీవుడ్‌తో సంబంధం ఉన్న వ్యక్తుల జీవనోపాధి తీవ్రంగా ప్రభావితమవుతోంది. ఇది ప్రస్తుతం స్వైర విహారం చేస్తున్న కరోనా వైరస్ మహమ్మారి కంటే ప్రమాదకరంగా మారింది. దీనివల్ల ఆదాయాలతో పాటు చాలా మంది ఉపాధిని కోల్పోతున్నారు.
బాలీవుడ్ సభ్యుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిల్లుతోంది. ఈ ఉదంతంగా కారణంగా చూపించి బాలీవుడ్ మొత్తాన్ని నేరస్థులుగా చిత్రీకరించడం, మాదకద్రవ్యాల సంస్కృతిలో మునిగిపోయిందని ప్రచారం చేస్తుండటంతో బాలీవుడ్ అంటేనే ఓ విష వలయం అనే అపోహ ప్రజల్లో నెలకొంది. నేర సామ్రాజ్యానికి బాలీవుడ్ పర్యాయపదంగా మార్చారని, దీంతో చాలా మంది విశ్వసనీయత ప్రశ్నార్థకంలో పడిందని ` సదరు కంప్లైంట్‌లో పేర్కొన్నారు.
దీనిపై రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. చాలా లేట్‌గా స్పందించారని బాలీవుడ్ ప్రముఖులు కోర్టులో వేసి పిల్ ఎలా వుందంటే `టీచర్ టీచర్ అర్నబ్ ముజే గాలీ దేరహహే` అని చిన్న పిల్లవాడు టీచర్‌కు కంప్లైంట్ చేసినట్టుగా వుందని సెటైర్లు వేయడం ఆసక్తికరంగా మారింది.
Reaction of Bollywood Is too late and too thanda ..All top film people complaining to Delhi high court is amounting to a school kid telling the teacher “ Teacher, Teacher , wo Arnab mujhe gaali de raha hai”
— Ram Gopal Varma (@RGVzoomin) October 12, 2020