
రామ్‌గోపాల్ వర్మ ఏది చేసినా సంచలనమే. లాక్‌డౌన్ ప్రారంభమైన దగ్గరి నుంచి మేకర్స్, డైరెక్టర్స్ అంతా సైలెంట్ అయిపోయి ఇంటి పట్టునే వుంటే వన్ బై వన్ వరుసగా సినిమాలని వదులుతూ వర్మ షాకిచ్చాడు. `క్లైమాక్స్` నుంచి నిన్న మొన్నటి `పవర్‌స్టార్` వరకు వరుసగా సినిమాల్ని రిలీజ్ చేసి ఆశ్చర్యపరిచాడు. తాజాగా వర్మ మరో సంచలనానికి తెరలేపిన విషయం తెలిసిందే.
`ఆర్జీవీ మిస్సింగ్` పేరుతో తనే తన పాత్రలో నటిస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు రామ్‌గోపాల్ వర్మ. అదిర్ వర్మ దర్శకుడిగా పరిచయం అవుతున్నప ఈ చిత్రాన్ని చటర్జీ నిర్మిస్తున్నాడు. తనని తాను ఇన్నె సెంట్ అని చెప్పుకున్న వర్మ తన మిస్సింగ్‌కి ప్రధాన సస్పెక్ట్‌లుగా పీకే ఫ్యాన్స్, మెగా ఫ్యామిలీ, మాజీ ముఖ్యమంత్రి, అతని తనయుడిని చేర్చారు.
ఫస్ట్ లుక్‌ని ఇటీవలే విడుదల చేసిన వర్మ అక్యూజ్డ్ వన్ అంటూ పవన్‌కల్యాణ్‌ని పోలిన వ్యక్తి పిక్‌ని రిలీజ్ చేశాడు. ఆ తరువాత అక్యూజ్డ్ నంబర్ 2 గా చిరు ని పోలిన వ్యక్తి ఫోటోని రిలీజ్ చేశాడు. తాజాగా తన కిడ్నాప్‌కి సంబంధించిన కేసుని డీల్ చేస్తూ ఇన్వెస్టగేట్ చేసే అధికారిగా ఏకంగా రజనీకాంత్‌నే దించేశాడు. అచ్చు రజనీని పోలిన వ్యక్తిని దింపేసిన వర్మ అతని పేరుని గజినికాంత్ అంటూ పరిచయం చేశాడు. ` RGV మిస్సింగ్ నుండి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ 5 వ లుక్ పోస్టర్ ఇది. .. ఎవరితోనైనా పోలిక కలిస్తే అది పూర్తిగా యాదృచ్ఛికం, ప్రమాదవశాత్తు జరిగిందే కానీ కావాలని చేసింది కాదు` అని కలరింగ్ ఇచ్చాడు.