Homeటాప్ స్టోరీస్లెస్బియన్ క్రైమ్ డ్రామాను ప్రకటించిన వర్మ

లెస్బియన్ క్రైమ్ డ్రామాను ప్రకటించిన వర్మ

rgv announces adult crime drama dangerous

rgv announces adult crime drama dangerousరామ్ గోపాల్ వర్మ ఈ కరోనా క్రైసిస్ సమయంలో ఉన్నంత యాక్టివ్ గా మరెవరూ లేరని చెప్పవచ్చేమో. వారానికి ఒక సినిమా అన్నట్లుగా వర్మ సినిమాలు వదులుతున్నాడు. అయితే అడల్ట్ మూవీ లేదంటే ఎవరి మీదైనా సెటైరికల్ మూవీ అన్నట్లుగా సాగుతోంది వర్మ శైలి. క్లైమాక్స్, నగ్నం, పవర్ స్టార్ సినిమాలను విడుదల చేసిన వర్మ మరో నాలుగు సినిమాల రూపకల్పనలో బిజీగా ఉన్నాడు. అందులో మర్డర్ చిత్రమొకటి. కరోనా వైరస్ పై మరో సినిమాను చేస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ.

- Advertisement -

ఇక ఈరోజు మరో అడల్ట్ మూవీని అనౌన్స్ చేసాడు ఆర్జీవీ. ఈసారి మరో స్థాయికి తీసుకెళుతూ లెస్బియన్ క్రైమ్ డ్రామాను తెరకెక్కిస్తున్నాడు. వాళ్ళ ఎఫైర్ డాన్స్, పోలీసులతో పాటు చాలా మందిని చంపేసింది అని క్యాప్షన్ తో ఈ లెస్బియన్ డ్రామాను తెరకెక్కిస్తున్నాడు వర్మ. ఇటీవలే ఆర్జీవీ పరిచయం చేసిన అప్సర రాణి, నైనా గంగూలీలు ఈ సినిమాలో లెస్బియన్స్ గా నటిస్తున్నారు. దీనికి డేంజరస్ అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేసాడు వర్మ. పోస్టర్లు చూస్తుంటే వర్మ ఏ రేంజ్ లో ఇందులో అడల్ట్ నెస్ చూపించాడో అర్ధమవుతోంది. దీనికి సంబందించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All