
తెలంగాణ ప్రభుత్వం ఈరోజు అందరినీ ఆశ్చర్యపరిచింది. రేపటి నుండి ఎటువంటి లాక్ డౌన్ ఉండదని ప్రకటించింది. దీంతో పాటు విధించిన నిబంధనలను కూడా పూర్తిగా ఎత్తివేసింది. సాయంత్రం 5 వరకూ రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగుతోంది. వచ్చే వారం నుండి నైట్ కర్ఫ్యూ వరకూ పెడతారని అనుకున్నారు కానీ తెలంగాణ ప్రభుత్వం కేసులు తక్కువ నమోదవుతున్నాయని, రాష్ట్రంలో పరిస్థితి అదుపులోకి వచ్చిందని తెలిపి లాక్ డౌన్ ను పూర్తిగా ఎత్తివేసింది.
అలాగే రాష్ట్రంలో థియేటర్లు, జిమ్ లు, స్విమ్మింగ్ పూల్స్ వంటివి తీర్చుకోవడానికి పూర్తిగా అనుమతులు ఇచ్చింది. దీంతో రాష్ట్రంలో థియేటర్లు మళ్ళీ తెరుచుకోనున్నాయి. అయితే ప్రస్తుతం కొత్త సినిమాలు విడుదల అయ్యే అవకాశాలు లేవు. పాత చిత్రాలే రీరిలీజ్ కానున్నాయి.
ఇక పెద్ద చిత్రాలు కూడా షూటింగ్ మూడ్ లోకి వెళ్లనున్నాయి. పుష్ప, ఆచార్య, రాధే శ్యామ్ వంటి చిత్రాలు జులై మొదటి వారం నుండి షూటింగ్ ను తిరిగి ప్రారంభిస్తున్నాయి.