
అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ `పుష్ప`. సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గానటిస్తున్న ఈ మూవీని మైత్రీ మూవీమేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో వుంది. బన్నీ పుష్పరాజ్ పాత్రలో ఊరమాస్ గెటప్‌లో గంధపు చెక్కల స్మగ్లర్‌గా కనిపించనున్న విషయం తెలిసిందే.
ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో కనీ వినీ ఎరుగని స్థాయిలో టెక్నికల్‌గా అత్యున్నతమైన ప్రమాణాలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 6:12 నిమిషాలకు ఈ చిత్రంలోని పుష్పరాజ్ అవతారానికి సంబంధించిన వీడియోని రిలీజ్ చేయబోతోంది చిత్ర బృందం. ఇప్పటికే భారీ స్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేశారు. మరో పక్క మంగళవారం ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు మొదలయ్యాయి.
తెలుగు సినిమా అంటే దేశంలోనే కాకుండా వరల్డ్ వైడ్‌గా భారీ క్రేజ్ పెరిగిపోవడంతో `పుష్ప` చిత్రాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సౌండ్ డిజైనర్‌గా ఆస్కార్ అవార్డ్ గ్రహీత రెసూల్ పూకుట్టిని ఫైనల్ చేశారు. బుధవారం ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం ఆయనకు ఈ మూవీలోకి వెల్కమ్ చెబుతూ ఓ పోస్టర్‌ని రిలీజ్ చేసింది.