Homeఎక్స్ క్లూసివ్డాక్టర్ ఏలూరికి అంతర్జాతీయ అవార్డు ప్రధానం చేసిన రెండు దేశాల ప్రతినిధులు

డాక్టర్ ఏలూరికి అంతర్జాతీయ అవార్డు ప్రధానం చేసిన రెండు దేశాల ప్రతినిధులు

Representatives of the two countries that made Dr. Eluri an international award winner
డాక్టర్ ఏలూరికి అంతర్జాతీయ అవార్డు ప్రధానం చేసిన రెండు దేశాల ప్రతినిధులు

ప్రఖ్యాత అంతర్జాతీయ సంస్థ అయిన ‘యూఆర్ఎస్ ఏషియా వన్’ నాల్గవ ఎడిషన్ లోని ఇండియాస్ గ్రేటెస్ట్ బ్రాండ్స్ అండ్ లీడర్స్ అవార్డు కార్యక్రమం సోమవారం దేశ ఆర్ధిక రాజధాని ముంబైలోని తాజ్ హోటల్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి రాందాస్ అదవాలె, మహారాష్ట్రకు చెందిన మంత్రులు.. పన్నెండు దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఎస్సార్సీ ల్యాబోరేటరీ అధినేత డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి కూడా ఇందులో పాల్గొన్నారు.

ఈ సందర్బంగా శాఖాపరంగా అదవాలెకు ఉత్తమ మంత్రి అవార్డు దక్కింది. అలాగే పార్మారంగంలో విశేష కృషి చేసిన ఎస్సార్సీ ల్యాబోరేటరీ అధినేత డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డికి ఉత్తమ బిజినెస్ లీడర్ అవార్డు దక్కింది. మలేసియా కాన్సుల్ జనరల్ జయినాల్ అజ్లన్ నాడీజిర్, ఇటలీ కాన్సుల్ జనరల్ స్టెఫానియా కోస్తాంజా లు డాక్టర్ ఏలూరికి అవార్డు ప్రధానం చేశారు.

- Advertisement -

సామాజిక దృక్పథంతో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నారని ఏలూరిని కొనియాడారు వక్తలు. గతంలో ఎస్సార్సీ ల్యాబోరేటరీ సంస్థ ఫార్మా రంగంలో చేసిన సేవలను గుర్తించి hmtv సంస్థ కూడా డాక్టర్ ఏలూరికి అవార్డు ను అందజేసింది.

ఈ సందర్బంగా డాక్టర్ ఏలూరి మాట్లాడుతూ.. తమ సంస్థ గత పదేళ్లుగా రీసెర్చ్ అండ్ డెవోలోప్మెంట్ లో అగ్రగ్రామిగా ఉంది, తక్కువ ఖర్చుతో క్యాన్సర్ డ్రగ్స్ ను అందిచాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. ఈ అవార్డు దక్కడానికి కారణమైన ఉద్యోగిని, ఉద్యోగులకు ధన్యవాదాలన్నారు.

ఇదిలావుంటే పార్మారంగం గురించి అదవాలెతో చర్చించారు ఏలూరి రామచంద్రారెడ్డి. ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఫార్మా పరిస్థితులను మంత్రికి వివరించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఫార్మా రంగం అభివృద్ధికి కృషిచేయాలని కోరారు. ఏలూరి విన్నపానాన్ని సావధానంగా విన్న అదవాలె.. ఏపీకి తమ సహకారం ఖచ్చితంగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఏలూరి సూచనలను ప్రధాని దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు అదవాలె. కాగా ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, యూఆర్ఎస్ ఏషియా వన్ అవార్డు గ్రహీతలు.. క్రికెటర్ శ్రీశాంత్, బాలీవుడ్ నటులు తదితర సెలబ్రిటీలు పాల్గొన్నారు.

Gallery:

 

 

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All