
రేణూ దేశాయ్ మరోసారి వార్తల్లో నిలిచారు. పవన్‌కల్యాణ్‌తో విడిపోయిన ఆమె ప్రస్తుతం పిల్లలతో పాటు హైదరాబాద్‌లో నివసిస్తోంది. సైలెంట్‌గా తన పని తాను చేసుకుపోతున్నా రేణు దేశాయ్ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. తనపై పుకార్లు వైరల్ అయిన ప్రతీసారి రేణు దేశాయ్ వివరణ ఇస్తూ వస్తోంది. తాజాగా ఆమెపై మరో పుకారు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రేణు దేశాయ్‌కి కోవిడ్ సోకిందని, ఆమెపై ఓ వార్త తాజాగా వైరల్ అవుతోంది. ఈ వార్త తెలుసుకున్న రేణు దేశాయ్ ఘాటుగా స్పందించింది. తనపై వస్తున్న పుకార్లకు కొంత మనస్థాపానికి గురైన రేణు దేశాయ్ పుకార్లు పుట్టించిన వారిపై మండి పడింది. తన ఫేస్‌బుక్ ప్రొఫైల్ లో తనకు ఎలాంటి వైరస్ సోకలేదని విమరణ ఇచ్చింది. అలాగే ఇలాంటి నిరాధారమైన వార్తల్ని నమ్మవద్దంటూ అభ్యర్థించారు.
`గైస్ నిజాయితీగా అభ్యర్థిస్తున్నాను. దయచేసి ఈ తెలివితక్కువ వెబ్ సైట్లు, ట్విట్టర్ హ్యాండిల్స్‌ను అనుసరించడం, నమ్మడం మానేయండి. ఈ తెలివితక్కువ వ్యక్తులు అబద్ధాలు, తప్పుడు వార్తలపై మాత్రమే మనుగడ సాగిస్తారు. ప్రముఖుల ధృవీకరించబడిన ఖాతాలను మాత్రమే నమ్మండి. మూర్ఖులని నమ్మవద్దు. ఇది నా గురించి మాత్రమే కాదు. సినీమా వాళ్లందరికి సంబంధించిన సమాచారాన్నిమీతో నేరుగా పంచుకోవడానికి మా అందరికీ అఫీషియల్ ఖాతాలు ఉన్నాయి` అని రేణు దేశాయ్ ఫేక్ వార్తలపై మండి పడ్డారు.