నేను విడాకులపై ఇప్పటివరకు కూడా నోరు విప్పలేదు , ఒకవేళ నేను నోరు విప్పితే అసలు రహస్యం బట్టబయలు అవుతుందని తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ . పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకున్న తర్వాత రేణు దేశాయ్ పూణే లో పిల్లలతో కలిసి ఉంటోంది . అయితే అప్పటి నుండి కూడా పవన్ కళ్యాణ్ పై ఎప్పుడు కూడా ఆరోపణలు చేయలేదు రేణు దేశాయ్ . అంతేకాదు వీలు చిక్కినప్పుడల్లా పవన్ కళ్యాణ్ ని పొగుడుతూనే ఉంది కూడా .
అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం రేణు దేశాయ్ ని ప్రతీసారి టార్గెట్ చేస్తూనే ఉన్నారు ఇన్నాళ్లు ఎలాగో అలా నెట్టుకుంటూ వచ్చింది కానీ తాజాగా రెండో వివాహానికి సిద్దమైన నేపథ్యంలో కూడా పవన్ ఫ్యాన్స్ రేణు దేశాయ్ ని ట్రోల్ చేస్తూ ఉండటంతో ఆగ్రహంతో ట్విట్టర్ నుండి వచ్చేసింది . ఇక ఇన్ స్టాగ్రామ్ లో మాత్రం తన అప్ డేట్స్ పెడుతోంది . అయితే కొంతమంది ఇన్ స్టాగ్రామ్ లోకి కూడా వెళ్లి రేణు దేశాయ్ ని ఇబ్బంది పెడుతున్నారు . ఇక కొంతమంది బూతులు తిట్టేస్తున్నారు కూడా దాంతో ఆగ్రహంతో ఊగిపోతోంది రేణు దేశాయ్ . అసలు విడాకులపై ఇప్పటివరకు నేను స్పందించలేదు , ఒకవేళ విడాకుల పై నేను నోరు విప్పితే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయి ? నేను ఇన్నాళ్లు నోరు మెదపనందుకు నాకు థాంక్స్ చెప్పాలి మీరు …… నేను నోరు విప్పితే రచ్చ రచ్చే అంటూ ఆవేశం వెళ్లగక్కింది . అంటే విడాకుల వెనుక పెద్ద మంత్రాగమే నడిచిందన్న మాట . మరి రేణు దేశాయ్ ఆ రహస్యాలను ఎప్పుడు వెల్లడిస్తుందో ?