
రేణు దేశాయ్ రెండో పెళ్లి కోసం తాజాగా ఫోటో షూట్ చేసి సంచలనం సృష్టించింది . గతకొంత కాలంగా రేణు దేశాయ్ రెండో చేసుకుంటోంది అని తెలుసు కానీ వివాహ నిశ్చితార్థం జరిగాక పెళ్లి ఎప్పుడు అన్నది తెలియకుండా ఉండటంతో ఇక పెళ్లి వాయిదా పడిందా అని అనుకున్నారు . కట్ చేస్తే నా పెళ్లి కి నాకు కాబోయే వాడు తీసిన ఫోటోలు అంటూ రేణు దేశాయ్ మురిసిపోతూ చెబుతుండటంతో పెళ్లి వార్త మళ్ళీ లైవ్ లోకి వచ్చింది .
అయితే రేణు దేశాయ్ తన రెండో పెళ్లి వివరాలను పూర్తిగా చెప్పకపోవడానికి కారణం ఏంటో తెలుసా …… ఒకటేమో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో కొంతమంది రేణు కు గట్టిగా వార్నింగ్ ఇస్తుండటం ఒక కారణమైతే అనవసరంగా మీడియాకు ఎక్కడం ఎందుకు సింపుల్ గా కొంతమంది సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకుంటే చాలు అని భావిస్తోందట అందుకే వివరాలు రహస్యంగా ఉంచుతోంది .