Monday, December 5, 2022
Homeగాసిప్స్లిప్ లాక్స్ అంటే భ‌య‌ప‌డుతోంద‌ట‌!

లిప్ లాక్స్ అంటే భ‌య‌ప‌డుతోంద‌ట‌!

లిప్ లాక్స్ అంటే భ‌య‌ప‌డుతోంద‌ట‌!
లిప్ లాక్స్ అంటే భ‌య‌ప‌డుతోంద‌ట‌!

క‌రోనా వైర‌స్ మ‌నం జీవించే విధానాన్ని, ప‌ని చేసే స్టైల్‌నీ, మ‌న ఆహార‌పు అల‌వాట్ల‌ను, మ‌న జీవ‌న శైలిని స‌మూలంగా మార్చేసింది. ఇదిలా వుంటే సినీ రంగంలోనూ దీని వ‌ల్ల స‌మూల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గ‌తంలో శృంగార స‌న్నివేశాల్లో న‌టించే తార‌లంతా క‌రోనా కార‌ణంగా ఆ త‌ర‌హా స‌న్నివేశాల్లో న‌టించ‌డానికి భ‌య‌ప‌డుతున్నారు. దీంతో మేక‌ర్స్ కూడా ఆ స‌న్నివేశాల్ని చిత్రీక‌రించే విధానంలోనూ మార్పులు చేర్పులు చేస్తున్నార‌ట‌.

- Advertisement -

క‌రోనా కార‌ణంగా చాలా మంది న‌టీన‌టులు ఈ త‌ర‌హా స‌న్నివేశాల్లో న‌టించ‌డానికి అంగీక‌రించ‌డం లేదు. ఆ విష‌యాన్ని బ‌హిరంగంగానే వెల్ల‌డిస్తున్నారు కూడా. దీంతో మేక‌ర్స్ స‌మూల మార్పుల‌కు  శ్రీ‌కారం చుట్టిన‌ట్టు తెలుస్తోంది. `ఎవ‌రు` సినిమాతో తెలుగులో హిట్‌ని సొంతం చేసుకున్న రెజీనా తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో శృంగార స‌న్నివేశాల గురించి ఆస‌క్తిక‌ర విష‌యాల్నివెల్ల‌డించింది. క‌రోనా పూర్తిగా అదుపులోకి వ‌చ్చిన త‌రువాతే తాను ఇంటిమేట్ సీన్‌ల‌లో న‌టిస్తాన‌ని, అంత వ‌ర‌కు తాను శృంగార స‌న్నివేశాల్లో న‌టించ‌న‌ని రెజీనా స్టేట్‌మెంట్ ఇచ్చిన‌ట్టు తెలిసింది.

గ‌తంలో రెజీనా లిప్‌లాక్‌తో పాటు హాట్ హాట్ స‌న్నివేశాల్లో న‌టించింది. అయితే ప్ర‌స్తుతం క‌రోనా కార‌ణంగా ప‌రిస్థితులు మార‌డంతో లిప్‌లాక్ స‌న్నివేశాల్లో న‌టించాలంటేనే భ‌య‌ప‌డుతోంద‌ట‌. ఈ విష‌యాన్నే రెజీనా వెల్ల‌డించింది. ఆమె న‌టిస్తున్న తాజా చిత్రం `చ‌క్ర‌` .విశాల్ హీరోగా న‌టిస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సైబ‌ర్ క్రైమ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో రెజీనా కొత్త త‌ర‌హా పాత్ర‌లో క‌నిపించ‌బోతోంది.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts