
స్టార్ హీరోయిన్ అవ్వాల్సిన లక్షణాలు అన్ని ఉన్నా సరే యువ హీరోలతో జతకట్టి కొద్దిపాటి క్రేజ్ సంపాదించి ఇప్పుడు ఆ రేసులో కూడా వెనకపడ్డ హీరోయిన్ రెజినా కసాండ్రా. కెరియర్ మొదట్లో ఫుల్ స్వింగ్ మీద ఉండగా ఇప్పుడు కెరియర్ పూర్తిగా వెనకపడ్డది. ఏవో చిన్న చిన్న సినిమాలు చేస్తూ కాలం వెళ్లదీస్తుంది. ఓ పక్క వెబ్ సీరీస్ లను కూడా చేస్తుంది రెజినా. తనకు వచ్చిన క్రేజ్ ను సరిగా వాడుకోని రెజినా ఏవో ప్రయోగాలు చేస్తూ వస్తుంది.
లేటెస్ట్ గా రెజినా చేస్తున్న సినిమా బ్రేకింగ్ న్యూస్ స్టార్ట్ అయ్యింది. జెడి చక్రవర్తి, సుబ్బరాజు, రెజినా ప్రధాన పాత్రలుగా వస్తున్న ఈ సినిమాను సుబ్బు వేదుల డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే బి.వి.ఎస్ రవి అందిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ సినిమాను రా ఎంటర్టైన్మెంట్స్, మ్యాంగో మాస్ వీడియో కలిసి నిర్మిస్తున్నారు.
రెజినా చేస్తున్న ఈ ప్రయత్నం అయినా సక్సెస్ అవుతుందో లేదో చూడాలి. ఇదే కాకుండా సుధీర్ వర్మ డైరక్షన్ లో శాఖిని డాఖిని అంటూ మరో సినిమా కూడా చేస్తుంది రెజినా.