
స్టార్స్ ను బ్రాండ్లను ప్రమోట్ చేయడం అనేది సర్వసాధారణం. బ్రాండ్లకు బెస్ట్ మైలేజ్ రావాలంటే వాటికి స్టార్స్ సపోర్ట్ తప్పనిసరి. అయితే ఆ స్టార్స్ బ్రాండ్స్ ను సపోర్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. అమితాబ్ బచ్చన్ వంటి వారికే బ్రాండ్స్ ను ప్రమోట్ చేసేటప్పుడు కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. పొగాకు బ్రాండ్ కు ప్రమోట్ చేసేవారు అమితాబ్. అయితే ఫ్యాన్స్ తో పాటు నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ టొబాకో ఎరాడికేషన్ కూడా కోరడంతో అమితాబ్ కూడా ఆ బ్రాండ్ ను విత్ డ్రా చేసుకున్నాడు.
సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా రీసెంట్ గా పొగాకు బ్రాండ్ ను ప్రమోట్ చేస్తే నెగటివిటీ వచ్చింది. మహేష్ చేతిలో ప్రస్తుతం చాలా బ్రాండ్స్ ఉన్నాయి కానీ ఈ పొగాకు బ్రాండ్ ట్రోల్స్ రావడం, మహేష్ ఇలా చేయాల్సింది కాదంటూ చాలా మంది అభిప్రాయపడ్డారు. ఇక రీసెంట్ గా రెజీనా మరో అడుగు ముందుకేసి విస్కీ యాడ్ ను ప్రమోట్ చేసింది.
ఇన్స్టాగ్రామ్ లో మందు గ్లాస్ పట్టుకుని సిగ్నేచర్ విస్కీ బాటిల్స్ తో ఉన్న ఫోటోను షేర్ చేసింది. “తొమ్మిదేళ్ళప్పుడు యాంకరింగ్ రంగంలోకి వచ్చాను. ఇప్పుడు సినిమాలు, యాడ్స్ చేసే స్థాయికి ఎదిగాను. నా ప్రయాణం ఎప్పటికీ పదిలం. ఈ మూమెంట్స్ ను నేను సిగ్నేచర్ తో సెలబ్రేట్ చేసుకుంటాను” అని రెజీనా పోస్ట్ పెట్టింది. ఇప్పుడు దీనిపై బోలెడన్ని ట్రోల్స్ వస్తున్నాయి. అందుకే స్టార్స్ బ్రాండ్స్ ను ప్రమోట్ చేసేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి.