Homeటాప్ స్టోరీస్రీటెలికాస్ట్ లో సైతం రికార్డులకి రెడీ అంటున్న ఎన్టీఆర్

రీటెలికాస్ట్ లో సైతం రికార్డులకి రెడీ అంటున్న ఎన్టీఆర్

రీటెలికాస్ట్ లో సైతం రికార్డులకి రెడీ అంటున్న ఎన్టీఆర్
రీటెలికాస్ట్ లో సైతం రికార్డులకి రెడీ అంటున్న ఎన్టీఆర్

గతంలో తెలుగు సినిమా అగ్ర హీరోలు నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరావు గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు, శోభన్ బాబు గారు, కృష్ణంరాజు గారు, మెగాస్టార్ చిరంజీవి గారు తదితర హీరోల కొత్త సినిమాలతో పాటు ఆల్రెడీ హిట్ అయిన సినిమాలను కూడా మళ్లీ రీ రిలీజ్ చేసేవారు బయ్యర్లు. అప్పట్లో ప్రజలకు వినోదానికి సినిమా కంటే గొప్ప సాధనం ఏది లేకపోవడంతో రిపీట్ రన్ లో కూడా అవి రికార్డు స్థాయి కలెక్షన్లు సాధించేవి. ప్రస్తుతం ఇప్పుడు అలాంటి పరిస్థితే నెలకొని ఉంది. వెండితెర మీద కాదు బుల్లి తెర మీద. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి భారత దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఏప్రిల్ 30 వరకు కూడా అలాగే కొనసాగిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ప్రజలందరూ ఎక్కువశాతం ఇళ్లకే పరిమితం అయిపోయారు.

టీవీ చానల్స్ కూడా తాము గతంలో తమకు గతంలో రికార్డు స్థాయి టి.ఆర్.పి లు సాధించిపెట్టిన విజయవంతమైన సీరియల్స్, రియాలిటీ షోలను మరియు అనేక సిరీస్లను పునః ప్రసారం చేస్తున్నాయి. తాజాగా స్టార్ మా యాజమాన్యం బిగ్ బాస్ సీజన్ వన్ తెలుగు షోను రీ టెలికాస్ట్ చెయ్యడానికి డిసైడ్ అయ్యింది. ఇక ఈ విషయం మీద ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్ స్టార్ట్ చేశారు. “ఎన్టీఆర్ బిగ్ బాస్ రీటెలికాస్ట్” అనే ట్యాగ్ విపరీతంగా వైరల్ అవుతోంది

- Advertisement -

అటు సినీ విశ్లేషకులు విమర్శకులు మరియు వీక్షకుల దృష్టిలో కూడా ఇప్పటివరకు బిగ్ బాస్ తెలుగు3 సీజన్ లలో ఉత్తమ వ్యాఖ్యాతగా ప్రజలందరినీ ఆకట్టుకున్న వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్. అటు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లను, ఇటు కార్యక్రమం చూసే ప్రేక్షకులను, ముఖ్యంగా తన నుంచి ఏ అంశాలు ఆశిస్తున్నారో.. అవి తప్పకుండా అందిస్తూ అభిమానులను ఇలా అందరినీ ఫుల్ జోష్ తో అలరించాడు ఎన్టీఆర్. ఆ తర్వాత సీజన్ 2 కి నాని వ్యాఖ్యాతగా వ్యవహరించినా.., సీజన్ 3 కి నాగార్జున గారు వచ్చి వ్యాఖ్యాతగా వ్యవహరించినా కూడా ఆ స్థాయి హైప్ రాలేదు అన్నమాట నిజం. అందుకనే స్టార్ మా యాజమాన్యం కూడా బిగ్ బాస్ సీజన్ వన్ ను రీటెలికాస్ట్ చేస్తూ ప్రేక్షకులను సాధ్యమైనంత ఎంటర్టైన్ చేస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All