Homeటాప్ స్టోరీస్బిగ్ బాస్ 5: విశ్వ ఎలిమినేషన్ కు కారణం ఇదేనా?

బిగ్ బాస్ 5: విశ్వ ఎలిమినేషన్ కు కారణం ఇదేనా?

 

Reason behind vishwa exit from bigg boss 5
Reason behind vishwa exit from bigg boss 5

బిగ్ బాస్ సీజన్ 5 లో లేటెస్ట్ గా విశ్వ ఎలిమినేట్ అయ్యాడు. హౌజ్ లో చాలా స్ట్రాంగ్ ప్లేయర్ అయిన విశ్వ ఎలిమినేట్ కావడం హౌజ్ మేట్స్ కు షాక్ ను కలిగించింది. అన్ని విషయాలను పెర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేసే విశ్వ ఎలా ఎలిమినేట్ అయ్యాడంటూ శ్రీరామ్ చంద్ర వాపోయాడు. నిజంగానే విశ్వ టాస్క్ లలో తన 100 శాతం ఇస్తూ వచ్చాడు. అలాగే రెండు సార్లు కెప్టెన్ అయ్యాడు కూడా. ఇక ఇంటి పనుల్లో కూడా విశ్వ ఎప్పుడూ ముందుండేవాడు.

- Advertisement -

హౌజ్ లో ఉన్న చాలా మంది కంటెస్టెంట్స్ కంటే కూడా విశ్వ బెటర్ ప్లేయర్. మరి విశ్వ ఎందుకు ఎలిమినేట్ అయ్యాడు? సరిగ్గా విశ్లేషించుకుంటే దీని వెనుక పలు కారణాలు కనిపిస్తాయి. విశ్వకు బయట పాపులారిటీ నామినేషన్స్ లో ఉన్న మిగతా వారితో పోల్చితే తక్కువ.

అలాగే ఓటింగ్స్ శాతంలో విశ్వ కంటే కూడా కాజల్ కు తక్కువ వచ్చాయి. కానీ కాజల్ కొంత వివాదాస్పద ప్లేయర్. ఆమె ఉంటే ఏదో ఒక రకంగా కంటెంట్ వస్తుంది. ఆమెకు ఎన్నీ మాస్టర్, రవి, శ్రీరామ్ చంద్ర వంటి వారితో ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఆమెతో పోల్చితే విశ్వ అంత కాంట్రవర్సీ ప్లేయర్ కాదు.

ఇందుకోసమే కాజల్ ను కాదని విశ్వను బిగ్ బాస్ మ్యానేజ్మెంట్ ఎలిమినేట్ చేసిందని అంటున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All