Homeటాప్ స్టోరీస్వాల్మీకి చిత్రంలోనుండి దేవిని ఎందుకు తప్పించాల్సి వచ్చింది?

వాల్మీకి చిత్రంలోనుండి దేవిని ఎందుకు తప్పించాల్సి వచ్చింది?

వాల్మీకి చిత్రంలోనుండి దేవిని ఎందుకు తప్పించాల్సి వచ్చింది?
వాల్మీకి చిత్రంలోనుండి దేవిని ఎందుకు తప్పించాల్సి వచ్చింది?

వరుణ్ తేజ్ నటించిన గద్దలకొండ గణేష్ సూపర్ హిట్ సాధించిన విషయం తెల్సిందే. ఈ చిత్ర విజయంలో కీలక పాత్ర మ్యూజిక్ కు కూడా ఇవ్వాలి. అందులోనూ ఎల్లువొచ్చి గోదారమ్మ రీమిక్స్ సాంగ్ ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించింది. మిక్కీ జె మేయర్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతం మాత్రమే కాకుండా అంతే గొప్పగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అందించాడు. అయితే ఈ చిత్రానికి మొదట అనౌన్స్ మెంట్ జరిగినప్పుడు మిక్కీ పేరు బదులు దేవిశ్రీ ప్రసాద్ పేరు ఉంది.

అనౌన్స్ మెంట్ అప్పుడు దేవి శ్రీ ప్రసాద్ పేరు వేసి కూడా అతణ్ణి ఎందుకు తొలగించాల్సి వచ్చింది? అన్న ప్రశ్న చాలా మందికి కలిగింది. దానికి ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో హరీష్ శంకర్ సమాధానం చెప్పారు. “నాకు చాలా ఇష్టమైన సంగీత దర్శకులలో దేవి ఒకరు. అందుకే తనతో ఉన్న చనువుతో తనని అడక్కుండానే వాల్మీకి పోస్టర్ లో దేవి పేరు వేసేసాను. అయితే చెన్నై వెళ్లి దేవిని కలిసినప్పుడు ఇందులో ఒక రీమిక్స్ పాట చేయాలని చెప్పగానే రీమిక్స్ పాటలు చేయనని, అది తన పాలసీకి విరుద్ధమని దేవి చెప్పాడు. 70 సినిమాలకు పైగా పని చేసిన దేవిని నా ఒక్క సినిమా కోసం పాలసీ పక్కన పెట్టమనడం భావ్యం కాదనిపించింది. అలాగే ఈ చిత్రంలో ఆ రీమిక్స్ సాంగ్ చాలా ముఖ్యం. అందుకే దేవికి రీప్లేస్మెంట్ కోసం చూసి మిక్కీని తీసుకున్నాం” అని చెప్పాడు హరీష్ శంకర్.

- Advertisement -

సినిమా విజయంలో రీమిక్స్ సాంగ్ ముఖ్య పాత్ర పోషించింది కాబట్టి హరీష్ శంకర్ నిర్ణయం సరైనదే అనుకోవచ్చు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All