Homeన్యూస్మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ధమాకా

మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ధమాకా

ravitejas dhamaka completes first schedule
ravitejas dhamaka completes first schedule

మాస్ మహారాజా రవితేజ వేగంగా సినిమాలను పూర్తి చేస్తున్నాడు. ఒక చిత్రాన్ని పూర్తి చేసి, ఎక్కువ బ్రేక్ లేకుండా మరో సినిమాను లైన్లో పెడుతున్నాడు. ఈ ఏడాది క్రాక్ తో రవితేజ సూపర్బ్ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. దాని తర్వాత రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడీని చేసాడు. ఈ సినిమా దాదాపుగా పూర్తయింది. దాని తర్వాత కొత్త దర్శకుడు శరత్ మండవ దర్శకత్వంలో రామారావు ఆన్ డ్యూటీ చిత్రాన్ని మొదలుపెట్టాడు.

ఈ సినిమా కూడా మెజారిటీ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమాకు బ్రేక్ ఇచ్చి తన నెక్స్ట్ చిత్రాన్ని లైన్లో పెట్టాడు రవితేజ. నేను లోకల్ ఫేమ్ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ధమాకా చిత్రాన్ని చేస్తున్నాడు రవితేజ. దసరా సందర్భంగా చిత్ర ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేసారు.

- Advertisement -

హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ధమాకా టీమ్ ఈ సందర్భాన్ని ఒక సెల్ఫీతో సెలబ్రేట్ చేసుకుంది. పెళ్లి సందD ఫేమ్ శ్రీలీల ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. బెజవాడ ప్రసన్న కుమార్ రచించిన ఈ చిత్రానికి భీమ్స్ సంగీతాన్ని అందిస్తున్నాడు. టిజి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ధమాకాకు సంబంధించిన మరింత సమాచారం త్వరలోనే విడుదల కానుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All