Homeటాప్ స్టోరీస్రవితేజ మరో చిత్రానికి ముహూర్తం ఖరారు

రవితేజ మరో చిత్రానికి ముహూర్తం ఖరారు

రవితేజ మరో చిత్రానికి ముహూర్తం ఖరారు
రవితేజ మరో చిత్రానికి ముహూర్తం ఖరారు

మాస్ మహారాజా రవితేజ వరస సినిమాలతో మంచి ఊపు మీదున్నాడు. ఈ ఏడాది క్రాక్ తో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన రవితేజ అదే ఊపులో వేగంగా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడీ చిత్రాన్ని పూర్తి చేసాడు. మరోవైపు శరత్ మండవ దర్శకత్వంలో మరో సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటున్నాడు. ఈ చిత్రానికి రామారావు ఆన్ డ్యూటీ అనే టైటిల్ ను ఖరారు చేసారు.

ఈ రెండు చిత్రాలతో పాటు ఇప్పుడు రవితేజ తన నెక్స్ట్ సినిమాను కూడా మొదలుపెట్టేశాడు. రవితేజ 69వ చిత్రానికి సంబంధించిన అధికారిక అప్డేట్ ఇప్పుడు బయటకు వచ్చింది. ఎప్పటినుండో వార్తల్లో ఉంటోన్న రవితేజ -త్రినాథరావు నక్కిన కాంబినేషన్ ఇప్పుడు కార్యరూపం దాల్చింది. త్రినాథరావుతో మొదటినుండి ట్రావెల్ చేస్తోన్న బెజవాడ ప్రసన్న కుమార్ ఈ చిత్రానికి కూడా రచన చేసాడు.

- Advertisement -

అక్టోబర్ 4న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ముహూర్తంతో పాటు మొదలవుతుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీతో పాటు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఈ సినిమాను నిర్మించనున్నారు. భీమ్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తాడు. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన మరిన్ని విశేషాలు త్వరలోనే రివీల్ అవ్వనున్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All