Homeటాప్ స్టోరీస్`డ్రైవింగ్ లైసెన్స్‌` రీమేక్‌లో ఆ ఇద్ద‌రు!

`డ్రైవింగ్ లైసెన్స్‌` రీమేక్‌లో ఆ ఇద్ద‌రు!

`డ్రైవింగ్ లైసెన్స్‌` రీమేక్‌లో ఆ ఇద్ద‌రు!
`డ్రైవింగ్ లైసెన్స్‌` రీమేక్‌లో ఆ ఇద్ద‌రు!

మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్‌లుగా నిలిచిన చిత్రాలు తెలుగులో ఈ మ‌ధ్య వ‌రుస‌గా రీమేక్ అవుతున్న విష‌యం తెలిసిందే. క‌ప్పెల‌, అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌, లూసీఫ‌ర్‌.. తాజాగా `డ్రైవింగ్ లైసెన్స్‌`. ఇందులో అత్య‌ధికంగా పృథ్వీరాజ్ సుకుమార‌న్ న‌టించిన చిత్రాలే వుండ‌టం విశేషం. ఇప్ప‌టికే అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్ రీమేక్ మొద‌లైంది. `లూసీఫ‌ర్` రీమేక్ వ‌చ్చేనెల నుంచి సెట్స్ పైకి రాబోతోంది. ఇదిలా వుంటే `డ్రైవింగ్ లైసెన్స్‌` రీమేక్‌ కూడా ప‌ట్టాలెక్క‌బోతోంది.

ఈ చిత్రాన్ని రామ్‌చ‌ర‌ణ్ రీమేక్ చేయ‌బోతున్నార‌ని వార్త‌లు షికారు చేశాయి. కానీ ఎలాంటి అప్ డేట్ లేదు. తాజాగా ఓ ఆస‌క్తిక‌ర‌మైన వార్త బ‌య‌టికి వ‌చ్చింది. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయ‌బోతున్నార‌ని, ఇందులో మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, త‌మిళ హీరో విజ‌య్ సేతుప‌తి న‌టించ‌నున్నార‌ని తాజా న్యూస్‌. ఈ చిత్ర రీమేక్ రైట్స్‌ని మెగా హీరో రామ్‌చ‌ర‌ణ్ సొంతం చేసుకున్నారు. ఆయ‌నే ఈ చిత్రాన్ని రిమేక్ చేయ‌బోతున్నారు.

- Advertisement -

ఇప్ప‌టికే ర‌వితేజ‌, విజ‌య్ సేతుప‌తి ఈ చిత్రంలో న‌టించ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశార‌ట‌. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ మొద‌లైంది. త్వ‌ర‌లోనే డైరెక్ట‌ర్ ఎవ‌రు? మ‌ఇగ‌తా న‌టీన‌టులు, ఎప్పుడు సెట్స్‌పైకి వెళుతుంది వంటి వివ‌రాల్ని వెల్ల‌డించ‌నున్నార‌ట‌. ప్ర‌స్తుతం ర‌వితేజ `ఖిలాడీ` చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్ర‌స్తుతం ఇట‌లీలో జ‌రుగుతోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All