Monday, January 17, 2022
Homeటాప్ స్టోరీస్అలాంటి పాత్ర‌ల‌కూ సిద్ధ‌మే!

అలాంటి పాత్ర‌ల‌కూ సిద్ధ‌మే!

Raviteja ready to act Villain roles
Raviteja ready to act Villain roles

మాస్ పాత్ర‌ల‌తో త‌న‌దైన మేన‌రిజ‌మ్స్‌, మ్యాడ్యులేష‌న్‌తో మాస్ మ‌హారాజ్‌గా పేరు తెచ్చుకున్నారు ర‌వితేజ‌. అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా , విల‌న్‌గా, హీరోగా మంచి గుర్తింపు పొందారు. `నీ కోసం` సినిమాతో హీరోగా మారిన‌ ఆయ‌నకు గుర్తింపును తెచ్చిపెట్టింది మాత్రం `ఇట్లు శ్రావ‌ణి సుబ్ర‌హ్మణ్యం, ఇడియ‌ట్ చిత్రాలే. హీరోగా 20 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో విభిన్న‌మైన చిత్రాల్లో న‌టించిన ర‌వితేజ‌కు మ‌ళ్లీ విల‌న్‌గా న‌టించాల‌ని వుంద‌ట‌.

- Advertisement -

గ‌తంతో పోలిస్తే ప్రేక్ష‌కుల మైండ్ సెట్ మారింద‌ని, కొత్త‌గా వుంటే త‌ప్ప సినిమాలు చూడ‌టం లేద‌ని, అలా వెతుకుతున్న స‌మ‌యంలోనే త‌న ద‌గ్గ‌రికి `డిస్కోరాజా` క‌థ వ‌చ్చింద‌ని, ప్రేక్ష‌కుల అభిరుచికి త‌గ్గట్టుగా కొత్త పంథాలో సాగే చిత్ర‌మిదని. కొత్త త‌రహా పాత్ర‌లో తాను క‌నిపిస్తాన‌ని ర‌వితేజ చెబుతున్నారు. పాత్ర బాగుండి, కొత్త ర‌త‌హా క‌థ‌ల‌తో న్యూ ఏజ్ డైరెక్ట‌ర్‌లు త‌న‌ని సంప్ర‌దిస్తే అందులో విల‌న్‌గా చేయ‌డానికి కూడా తాను సిద్ధ‌మేన‌ని స్ప‌ష్టం చేశారు.

బాబీ సిహా పోషించిన త‌ర‌హా విల‌న్ పాత్ర‌ల్లో న‌టించాల‌ని వుంద‌ని, అలాంటి విభిన్న‌మైన పాత్ర‌ల కోసం ఎదురుచూస్తున్నాన‌ని, అలాంటి క‌థ‌ల‌తో వ‌స్తే న‌టించ‌డానికి త‌న‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని ర‌వితేజ ఇటీవ‌ల ఓ మీడియాకిచ్చిన వీడియో ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ర‌వితేజ న‌టించిన తాజా చిత్రం `డిస్కోరాజా` ఈ నెల 24న విడుద‌ల‌వుతున్న విష‌యం తెలిసిందే.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts