
మాస్ మహారాజా రవితేజ దూకుడు మాములుగా లేదు. ఒకటి రెండు సినిమాలే కాదు నాల్గు , ఐదు సినిమాలను చేస్తున్నాడు. రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా , టైగర్ నాగేశ్వరావు , రావణాసుర చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇందులో రావణాసుర విషయానికి వస్తే..సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తుండగా..అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా శ్రీకాంత్ విస్సా రైటర్ గా పనిచేస్తున్నాడు.
ప్రస్తుతం షూటింగ్ దశలోనే ఉండగా..ఈ చిత్ర రైట్స్ కోసం పోటీపడుతున్నారు. తాజాగా ఆడియో హక్కులను ప్రఖ్యాత మ్యూజిక్ లేబుల్ కంపెనీ ‘సరిగమ సౌత్’ సొంతం చేసుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘రావణాసుర’ చిత్రానికి హర్ష వర్దన్ రామేశ్వర్ మరియు భీమ్స్ సిసిరిలియో కలిసి సంగీతం సమకూరుస్తున్నారు. సరిగమ సంస్థ ఫ్యాన్సీ రేటుకు ఈ ఆల్బమ్ మ్యూజిక్ రైట్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ లో అను ఇమాన్యుయేల్ – మేఘా ఆకాష్ – ఫరియా అబ్దుల్లా – దక్ష నగార్కర్ – పూజిత పొన్నాడ వంటి ఐదుగురు ముద్దుగుమ్మలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.