Homeన్యూస్మారేడుమిల్లి లో రవితేజ..!

మారేడుమిల్లి లో రవితేజ..!

Raviteja Ramarao movie shooting in Maredumilli
 

మాస్ మహరాజ్ రవితేజ హీరోగా శరత్ మండవ డైరక్షన్ లో వస్తున్న సినిమా రామారావు ఆన్ డ్యూటీ. రమేష్ వర్మ డైరక్షన్ లో ఖిలాడి సినిమా పూర్తి చేసిన రవితేజ రామారావు సినిమా షూటింగ్ బిజీలో ఉన్నాడు. ఇక ప్రస్తుతం రామారావు సినిమా మారేడుమిల్లిలో షూటింగ్ జరుపుకుంటుందని తెలుస్తుంది. సినిమాలో కొన్ని సీన్స్ మారేడుమిల్లి లో చేస్తారని తెలుస్తుంది. సినిమాలో రవితేజ సరసన దివ్యాన్ష కౌశిక్ హీరోయిన్ గా నటిస్తుంది.

మారేడుమిల్లిలో రామారావు సినిమా చివరి షెడ్యూల్ జరుపుకుంటుంది. ఈ షెడ్యూల్ తో సినిమా టాకీ పార్ట్ పూర్తవుతుందని చెబుతున్నారు. క్రాక్ తో సూపర్ హిట్ కొట్టిన రవితేజ ఖిలాడి, రామారావు సినిమాలతో కూడా హిట్ మేనియా కొనసాగించాలని చూస్తున్నాడు. తప్పకుండా రవితేజ తన మార్క్ ఎంటర్టైనింగ్ సినిమాలతో తన ఫ్యాన్స్ ను అలరించే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఖిలాడి లో రవితేజ డబుల్ రోల్ లో సూపర్ మాస్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All