Homeటాప్ స్టోరీస్25 న విజయం సాధించే చిత్రం ఏదో

25 న విజయం సాధించే చిత్రం ఏదో

raviteja nela ticket v/s kalyan ram naa nuvve ఈనెల 25న మూడు చిత్రాలు విడుదల అవుతున్నాయి , అందులో మాస్ మహారాజ్ నటించిన ” నేల టిక్కెట్టు ” , నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ” నా నువ్వే ”, ”అమ్మమ్మ గారిల్లు ” కూడా విడుదల అవుతున్నాయి అయితే నాగశౌర్య నటించిన అమ్మమ్మ గారిల్లు విడుదల లో కొంత ఇబ్బంది ఉంది కానీ మిగతా రెండు చిత్రాలు మాత్రం విడుదలయ్యే ఛాన్స్ ఉంది అయితే ఈ రెండు చిత్రాల్లో విజయం సాధించే సినిమా ఏదో చూడాలి .

రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రానికి ఎక్కువ స్కోప్ ఉంది ఎందుకంటే ఈ చిత్రానికి దర్శకుడు కళ్యాణ్ కృష్ణ . సోగ్గాడే చిన్ని నాయనా వంటి బ్లాక్ బస్టర్ తో పాటుగా రారండోయ్ వేడుక చూద్దాం వంటి హిట్ చిత్రానికి దర్శకత్వం వహించాడు . ఈ నేల టిక్కెట్టు కూడా హిట్ అయితే హ్యాట్రిక్ కొట్టినట్లే ! పైగా రవితేజ అంటే మాస్ ని అలరించే అంశాలు ఉంటాయి కాబట్టి నేల టిక్కెట్టు పై అంచనాలు ఉన్నాయి . ఇక నందమూరి కళ్యాణ్ రామ్ నా నువ్వే సినిమా విషయానికి వస్తే కళ్యాణ్ రామ్ కొత్తగా కనిపిస్తున్నాడు పైగా తమన్నా హీరోయిన్ . అయితే కళ్యాణ్ రామ్ ని లవర్ బాయ్ గా ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా తెలియాలంటే ఈనెల 25 వరకు ఎదురు చూడాల్సిందే .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All