Homeటాప్ స్టోరీస్ఈ సంక్రాంతి విన్న‌ర్ ఎవ‌రు?

ఈ సంక్రాంతి విన్న‌ర్ ఎవ‌రు?

ఈ సంక్రాంతి విన్న‌ర్ ఎవ‌రు?
ఈ సంక్రాంతి విన్న‌ర్ ఎవ‌రు?

ఈ సంక్రాంతి బ‌రిలో విన్న‌ర్‌గా నిలిచింది ఎవ‌రు? అన్న‌ది ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దీనిపై ఇండ‌స్ట్రీలో చ‌ర్చ న‌డుస్తోంది. సంక్రాంతి బ‌రిలో ముందుగా విడుద‌లైన చిత్రం మాస్ మహారాజా ర‌వితేజ `క్రాక్‌`. రియ‌ల్ ఇన్సిడెంట్స్ నేప‌థ్యంలో కిర్రాక్ పోలీస్ స్టోరీగా ఈ మూవీని ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేని తెర‌కెక్కించారు. జ‌న‌వ‌రి 9న ఆర్థిక ఇబ్బందుల కార‌ణంగా ఫ‌స్ట్ షో నుంచి మొద‌లైన ఈ మూవీ యునానిమ‌స్‌గా హిట్ టాక్ ని సొంతం చేసుకుంది.

క‌లెక్ష‌న్స్ ప‌రంగానూ భారీ స్థాయిలో వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది. ఆ త‌రువాత జ‌న‌వ‌రి 13న త‌మిళ డ‌బ్బిం‌గ్ మూవీ `మాస్ట‌ర్` విడుద‌లైంది. తొలి షోకే డివైడ్ టాక్‌ని తెచ్చుకుంది. కేవ‌లం హీరో విజ‌య్ ఫ్యాన్స్‌ని దృష్టిలో పెట్టుకుని చేసిన సినిమా అంటూ విమ‌ర్శ‌కులు సైతం ఈ మూవీపై పెద‌వి విరిచారు. ఆ త‌రువాత జ‌న‌వ‌రి 14న రామ్ న‌టించిన `రెడ్‌`, బెల్లంకొండ శ్రీ‌నివాస్ న‌టించిన `అల్లుడు అదుర్స్‌` చిత్రాలు పోటా పోటీగా విడుద‌ల‌య్యాయి.

- Advertisement -

కానీ ఎలాంటి ప్ర‌భావాన్ని చూపించ‌లేక‌పోయాయి. `రెడ్` క‌ఫ్యూజ్డ్‌ స్క్రీన్‌ప్లేతో సాగ‌గా `అల్లుడు అదుర్స్‌` రొటీన్ స్టోరీతో రొటీన్ సీన్స్‌.. ఫైట్స్‌తో పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది. ఈ మూడు చిత్రాలకు పూర్తి భిన్నంగా బ‌ల‌మైన కంటెంట్‌లో విడుద‌లై హిట్ టాక్‌ని సొంతం చేసుకున్న `క్రాక్‌` సంక్రాంతి బ‌రిలో విన్నర్‌గా నిలిచిచింది. క్రాక్ ఇప్ప‌టి వ‌ర‌కు నైజామ్‌లో 6.30 కోట్లు, సీడెడ్‌లో 3.06 కోట్లు, ఆంధ్రాలో 8.50 కోట్లు షేర్ సాధించి ముందు వ‌రుస‌లో నిలిచింది. ఈ మూవీ క్లోజింగ్ క‌లెక్ష‌న్స్  నైజామ్‌లో 12 కోట్లు, సీడెడ్‌లో 8 కోట్లు, ఆంధ్రాలో 15 కోట్లు షేర్ రాబ‌ట్ట గ‌లిగితే బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచిన‌ట్టే అని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All