
మాస్ మహారాజా రవితేజ క్రాక్ చిత్రంతో సూపర్బ్ బౌన్స్ బ్యాక్ ఇచ్చాడు. ఈ సినిమా కరోనా పరిస్థితుల నేపథ్యంలో కూడా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఆ చిత్రం ఇచ్చిన ఊపులో మాస్ రాజా వరసగా సినిమాలను లైన్లో పెట్టాడు. ఈ లైనప్ లో ముందుగా ఒప్పుకున్న చిత్రం ఖిలాడీ. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. రాక్షసుడు ఫేమ్ రమేష్ వర్మ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసాడు. మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించారు.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతుండగా ఖిలాడీ రిలీజ్ కు సంబంధించిన అప్డేట్ ను ఇచ్చారు నిర్మాతలు. ఫిబ్రవరి 11, 2022న ఈ సినిమా విడుదల కానుంది. అంటే ఈ చిత్రం అడివి శేష్ మేజర్ చిత్రంతో డైరెక్ట్ గా క్లాష్ కానుంది. రెండూ భిన్నమైన జోనర్ లకు చెందిన చిత్రాలు కాబట్టి పెద్ద సమస్య ఉండకపోవచ్చు. అలాగే ఫిబ్రవరి 4న మెగాస్టార్ చిరంజీవి ఆచార్య కూడా విడుదలవుతోంది.
దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఖిలాడీ ఫస్ట్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే ఫుల్ లెంగ్త్ లో ప్రమోషన్స్ ను చేపట్టనున్నారు. క్రాక్ ఇచ్చిన ఊపుని ఈ చిత్రంతో కూడా కొనసాగించాలని రవితేజ ఫ్యాన్స్ భావిస్తున్నారు.
Also Read:
హ్రితిక్ రోషన్ చేస్తాడేమో: నాని
See you in cinemas ? #Khiladi
February 11th, 2022. pic.twitter.com/vCW6y3P1Kf
— Ravi Teja (@RaviTeja_offl) November 11, 2021