Homeన్యూస్ఖిలాడి వచ్చేది అప్పుడేనా..?

ఖిలాడి వచ్చేది అప్పుడేనా..?

Raviteja Khiladi New Release Date

మాస్ మహరాజ్ రవితేజ హీరోగా రమేష్ వర్మ డైరక్షన్ లో వస్తున్న సినిమా ఖిలాడి. మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఏప్రిల్ ఎండింగ్ లోనే రిలీజ్ డేట్ ప్రకటించిన ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఈమధ్యనే దీవాళి కానుకగా నవంబర్ 4న ఖిలాడి రిలీజ్ అవుతుందని అన్నారు. కాని ఆ డేట్ న కూడా సినిమా రావడం కష్టమని తెలుస్తుంది. లేటెస్ట్ గా ఖిలాడి సినిమా డిసెంబర్ 3న రిలీజ్ ఫిక్స్ చేసినట్టు టాక్.

- Advertisement -

అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. క్రాక్ తర్వాత రవితేజ నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో రవితేజ డ్యుయల్ రోల్ లో నటిస్తున్నారు. సినిమాలో రవితేజ వేరియేషన్స్ మాస్ ఫ్యాన్స్ ను అలరిస్తాయని తెలుస్తుంది. తప్పకుండా మాస్ రాజా ఫ్యాన్స్ ను ఖుషి చేసేలా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు.

ఈ సినిమా తర్వాత రవితేజ శరత్ మండవ డైరక్షన్ లో రామారావు ఆన్ డ్యూటీ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలో రవితేజ ఎమ్మార్వోగా నటిస్తున్నాడని తెలుస్తుంది. రవితేజ మార్క్ ఎంటర్టైనింగ్ గా ఈ సినిమా కూడా వస్తుందని తెలుస్తుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All